మారుతీ నుంచి రెండు సూపర్ కొత్త కార్లు?

Purushottham Vinay
కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇండియాలో ఫేమస్ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా దూసుకుపోతున్న మారుతి సుజుకి ఇండియా  నుంచి రెండు కొత్త మోడల్ కార్లు రాబోతున్నాయి.మారుతి కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ (Fronx), జిమ్నీ (Jimny) అనే రెండు మోడల్ కార్లు ఏప్రిల్ నెల రెండో వారంలో లాంచ్ కానున్నాయి.ఇంకా ఈ రెండు మోడళ్ల లాంచ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను మారుతి కంపెనీ రివీల్ చేసింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏప్రిల్ నెల రెండో వారంలో లాంచ్ కానుండగా.. మారుతి సుజుకి జిమ్నీ కార్ ఆ వెంటనే లాంచ్ కానుంది. ఇప్పటిదాకా Fronx మోడల్ కారుకి మొత్తం 15,500 బుకింగ్‌లు నమోదయ్యాయి.ఇక రోజుకు దాదాపు 218 బుకింగ్‌లు అయ్యాయి. జిమ్నీకి మొత్తం 23,500 బుకింగ్‌లు వచ్చాయి.అంటే రోజుకు దాదాపు 331 బుకింగ్‌లు వచ్చాయి. రెండు SUVలకు సంబంధించి బుకింగ్‌లు జనవరి 12 వ తేదీన ప్రారంభమయ్యాయి. ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ చేసిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర రూ. 6.75 లక్షల నుంచి రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజిలో ఉండవచ్చు.


మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9 లక్షల నుంచి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) దాకా ఉండవచ్చు. ఈ ఫ్రాంక్స్ కారు సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా ఇంకా అలాగే ఆల్ఫా ఐదు వేరియంట్‌లలో రానుంది.అయితే జిమ్నీకి మాత్రం జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్‌లు మాత్రమే ఉన్నాయి.Fronx రెండు ఇంజన్ ఆప్షన్లతో రానుంది. K12N 1.2-లీటర్ Dual-Jet Dual-VVT, పెట్రోల్ (90PS/113Nm), K10C 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ (100PS/148Nm) ఉండగా, ఇక K12N ఇంజిన్ 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఆప్షన్లతో రాబోతుంది. అయితే, K10C ఇంజిన్ 5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్ ని కలిగి ఉంది. జిమ్నీ కార్ లో అయితే 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ (103PS/134Nm) ఉంది. ఇది 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ ATతో కలిగి ఉంది. SUV సుజుకి ALLGRIP PRO 4WD టెక్నాలజీ లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్)తో  వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: