సూపర్ ఫీచర్లతో Citroen eC3 విడుదల?

Purushottham Vinay
ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఆటోమొబైల్ కంపెనీల్లో పోటీ వాతావరణం నెలకొంది. ఒకదానికి మించి మరొకటి సూపర్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో తమ తమ వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి.ఇక ఈ క్రమంలో ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ సిట్రోయెన్ కంపెనీ ఈసీ3( Citroen eC3)కారుని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఇక ఈ మోడల్ రిలీజ్ కాకముందు దీని గురించి చాలా లీక్ లు మార్కెట్లో వైరల్ అయ్యి చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు తన ఇక ఇండియన్ మార్కెట్లోకి ఈ కారు అడుగు పెట్టింది. ఇండియన్ ఫేమస్ కార్ కంపెనీ టాటాకి చెందిన టియాగో ఈవీ కారుకు పోటీగా తీసుకొచ్చిన ఈకారు ధరను మాత్రం ఆ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. జనవరి 22 వ తేదీ నుంచి బుకింగ్స్ స్టార్ట్ చేసి, ఫిబ్రవరి నెల నుంచి కస్టమర్ లకు డెలివరీలు ప్రారంభించాలని ఆ కంపెనీ ట్రై చేస్తుంది.


ఇక ఈ ఈసీ3 కారు చాలా వరకూ కూడా ఐసీఈ వెర్షన్(ICE version)కు దగ్గరలో ఉంటుంది. దీనిలో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు ఇంకా అలాగే కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉంటాయి.ఇంకా అలాగే సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఈబీడీతో కూడిన ఏబీస్ సిస్టం కూడా ఇందులో అందుబాటులో ఉంది.ఇంకా ఈ సిట్రోయెన్ ఈసీ3 కారులో 29.3 kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిలో మొత్తం 3.3 కిలోవాట్ల చార్జర్ ఉంటుంది. 57 హార్స్ పవర్ తో కూడిన మోటార్ కూడా ఉంటుంది. ఇది 143ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. దీనిని ఒకసారి కనుక చార్జ్ చేస్తే ఏకంగా 320 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. దీనికి రెండు డ్రైవింగ్ మోడ్లు కూడా ఉంటాయి. స్టాండర్ట్ ఇంకా అలాగే ఎకో మోడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. రిజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ కారు కేవలం 6.8 సెకండ్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్ ని అందుకోగలుగుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 107 కిలోమీటర్లు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: