టాటా టియాగో ఈవి: కస్టమర్లకు బంపర్ ఆఫర్?

frame టాటా టియాగో ఈవి: కస్టమర్లకు బంపర్ ఆఫర్?

Purushottham Vinay
భారత దేశపు అతి పెద్ద ఆటోమొబైల్  కంపెనీ టాటా మోటార్స్  ఇటీవల ఇండియన్  మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'టియాగో ఈవి' బుకింగ్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొనుగోలుదారుల కోసం కంపెనీ ఎట్టకేలకు బుకింగ్స్ రిసీవ్  చేసుకోవడం  స్టార్ట్  చేసింది.'టాటా టియాగో ఈవి' కొనాలనుకునే కస్టమర్లు రూ. 21,000 చెల్లించి ఆన్లైన్ లో లేదా కంపెనీ అఫీషియల్  డీలర్షిప్ లో గానీ బుక్ చేసుకోవచ్చు. అయితే బుక్ చేసుకున్న కష్టమరలకు డెలివరీలు 2023 జనవరి నుంచి ప్రారంభమవుతాయి. అంతకంటే ముందు టెస్ట్ డ్రైవ్స్ ప్రారంభమవవుతాయి. టెస్ట్ డ్రైవ్స్ డిసెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.టాటా మోటార్స్  టియాగో ఈవి ధరల విషయానికి వస్తే, ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ ధరలు కేవలం మొదట బుక్ చేసుకున్న 10,000 మంచికి మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత బుక్ చేసుకునే వారికి కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయి.ఇండియన్  మార్కెట్లో విడుదలైన అత్యంత సరసమైన 'టాటా టియాగో ఈవి' మొత్తం 4 ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి XE, XT, XZ+ ఇంకా XZ+ టెక్ లక్స్. ఇందులో ఎక్కువమంది కొనుగోలుదారులు టాప్ వేరియంట్ అయిన XZ+ టెక్ లక్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.



 ఇప్పటికే కొన్ని చోట్ల అనధికార బుకింగ్స్ కూడా స్టార్ట్  అయినట్లు తెలుస్తోంది.కొత్త టాటా టియాగో ఈవి మంచి డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు  బాడీ చుట్టూ ఎలక్ట్రిక్ బ్లూ యాక్సెంట్‌లను కలిగి, క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, గ్రిల్‌పై ఉన్న ట్రై-యారో మోటిఫ్ గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో టీల్ బ్లూ కలర్ తో ఉంటుంది. ఎడమవైపు ఉన్న హెడ్‌లైట్‌ పైన 'EV'కూడా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 14 ఇంచెస్ స్టీల్ వీల్ ఉంటుంది.ఇవన్నీ కూడా ఈ కొత్త కారుకి కొత్త లుక్ అందిస్తాయి.అలాగే కార్  ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కార్ లో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది.ఇది ఆపిల్ కార్‌ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పుష్ బటన్ స్టార్ట్ ఇంకా క్రూయిజ్ కంట్రోల్‌ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: