XUV700: భారీ బుకింగ్స్.. కానీ?

Purushottham Vinay
ఇక దేశీయ వాహన తయారీ సంస్థ అయిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఇండియన్ మార్కెట్లో 'మహీంద్రా ఎక్స్యూవీ700' విడుదల చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అసలు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.ఎందుకంటే మహీంద్రా కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటికి ఏకంగా 1.5 లక్షల బుకింగ్స్ స్వీకరించగలిగింది.మహీంద్రా కంపెనీ తన XUV700 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం 3 గంటల సమయంలోనే మొత్తం 50,000 బుకింగ్స్ స్వీకరించి గొప్ప రికార్డ్ సృష్టించింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే కేవలం 3 గంటల్లో 50,000 బుకింగ్స్ అంటే అది అసలు సాధారణమైన విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే ఈ SUV కార్ కి ప్రారంభం నుంచి ఎంత డిమాండ్ ఉందొ చాలా స్పష్టంగా అర్థమవుతుంది.ఇక మహీంద్రా కంపెనీ ఈ SUV కార్ ని దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు నెలలో ప్రారంభించింది. అయితే డెలివరీలు 2021 సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమయ్యాయి.


మొదట్లో కంపెనీ ఈ SUV డెలివరీలలో కొంత ఆలస్యం అనేది చేసినప్పటికీ, క్రమంగా డెలివరీలు అనేవి వేగవంతం అవుతున్నాయి. మొదట్లో కరోనా ప్రభావం ఇంకా సెమికండక్టర చిప్ కొరతలు కారణంగా ఉత్పత్తి ,ఇంకా అలాగే డెలివరీలు మందగించాయి.ఇక మహీంద్రా కంపెనీ 2021 సెప్టెంబర్ నుండి జూన్ 2022 వరకు, మొత్తం 41,846 యూనిట్లను డెలివరీ చేయగలిగింది. ఇక దీనిని బట్టి చూస్తే కంపెనీ సగటున నెలకు 4185 యూనిట్ల XUV700 డెలివరీ చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికీ దీనికున్న డిమాండ్ తగ్గకపోగా రోజురోజుకి బుకింగ్స్ చేసుకునేవారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.కాబట్టి ఇప్పటికి కూడా దీని కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు సంవత్సరం ఉంది.అయితే బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరగా డెలివరీలు అనేవి చేయడానికి కంపెనీ ఈ SUV ఉత్పత్తిని మరింత వేగవతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి దాదాపు 50,000 యూనిట్లు డెలివరీ చేసింది అనుకున్నా కూడా ఇంకా ఒక లక్ష యూనిట్ల డెలివరీ పెండింగ్ లో ఉంది. కాబట్టి కంపెనీ ఉత్పత్తిని గత కొన్ని నెలలుగా వేగవతం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: