Splendor Plus Xtec: అదిరిపోయే హైటెక్ ఫీచర్స్!

Purushottham Vinay
ఇక భారతదేశంలో హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్ బైక్ మంచి ప్రజాదరణ పొందిన బైక్‌. మీరు రోడ్డుపైకి వెళితే ఎన్ని స్ల్పెండర్ బైక్‌ కనిపిస్తాయో అసలు ఊహించలేరు.సాధారణ బైక్‌ల కంటే కూడా స్ప్లెండర్‌ బైక్ పై హీరో కంపెనీ చాలా ఎక్కువ దృష్టి సారించింది. ఇంకా అలాగే ఇందులో మంచి హైటెక్ ఫీచర్‌లను కూడా కంపెనీ అమర్చింది. ఈ రోజు కొత్త స్ల్పెండర్‌ ప్లస్ XTEC హైటెక్ మోడల్ ఫీచర్ల గురించి పూర్తి వివరాలని చదివి తెలుసుకుందాం.ఇక స్ప్లెండర్ ప్లస్ సాధారణ మోడల్ కాకుండా XTEC మోడల్‌లో అద్భుతమైన హైటెక్ ఫీచర్లని అందించారు. ఈ SPLENDOR+ XTEC I3S DRUM SELF CAST గురించి మాట్లాడితే.. దీని ధర వచ్చేసి రూ. 73,928 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇది (ఎక్స్-షోరూమ్) ధర. కాబట్టి ఇది ఆన్-రోడ్‌కు వచ్చిన తర్వాత ధర పెరుగుతుంది.


దీని ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ మోటార్‌సైకిల్ మీకు డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, రియల్ టైమ్ మైలేజ్ రీడౌట్ అలాగే సైడ్ స్టాండ్ ఇంకా అలాగే ఇంజిన్ కటాఫ్ అలాగే కాల్ SMS అలర్ట్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది. ఈ ఫీచర్లు ఈ మోటార్‌సైకిల్‌ను చాలా విభిన్నంగా చేశాయి.ఇక ఈ Splendor Plus Xtec బైక్ మొత్తం నాలుగు రంగులలో వస్తోంది. అవి టోర్నాడో గ్రే, మెరిసే బీటా బ్లూ, కాన్వాస్ బ్లాక్ ఇంకా అలాగే పెరల్ వైట్. ఇంకా అలాగే ఇంజిన్ గురించి చెప్పాలంటే ఇది అయితే మునుపటి మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది మాత్రం 97.2cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్.ఇక ఇది 7.9 bhp, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. i3S ఇంజిన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో ఈ బైక్ అమర్చబడి ఉంటుంది. ఇది మైలేజీని పెంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: