వేగం గంటకు 2100 కిమీ.. 3 గంటల్లో న్యూయార్క్ టు లండన్‌!

Purushottham Vinay
అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ అయిన బూమ్ సూపర్‌సోనిక్ తన రాబోయే ఓవర్‌చర్ ఏరోప్లేన్ ప్రొడక్షన్ రెడీ డిజైన్‌ను వెల్లడించింది. గడచిన 2003 వ సంవత్సరంలో చివరిసారిగా ఎగిరిన కాంకోర్డ్ విమానం తర్వాత, గాలిలోకి ఎగరబోయే మొదటి సూపర్‌సోనిక్ ఎయిర్‌లైనర్‌గా కూడా అవతరించాలని బూమ్ ఓవర్‌చర్ లక్ష్యంగా పెట్టుకుంది.ఇక బూమ్ మొదటిసారిగా 2016 వ సంవత్సరంలో ఓవర్‌చర్‌ను కాన్సెప్ట్ రూపంలో బహిర్గతం చేసింది. కాంకోర్డ్ ఇంగ్లీష్ ఎయిర్ షోలో అరంగేట్రం చేసిన దాదాపు 51 సంవత్సరాల తర్వాత 2022 ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షోలో ఫ్యూచర్ సూపర్‌సోనిక్ జెట్ కొత్త రీడిజైన్ వెర్షన్ కి బహిర్గతమైంది. బూమ్ ఓవర్‌చర్ సూపర్‌సోనిక్ విమానం ఇప్పుడు ఉత్పత్తి దశకు కూడా సిద్ధంగా ఉంది.ఇక దాదాపు 26 మిలియన్ కోర్-గంటల సిమ్యులేటెడ్ సాఫ్ట్‌వేర్ డిజైన్‌లు, ఐదు విండ్ టన్నెల్ పరీక్షలు ఇంకా అలాగే 51 పూర్తి డిజైన్ పునరావృతాలను జాగ్రత్తగా మూల్యాంకనం చేసిన తర్వాత ఓవర్‌చర్ డిజైన్ ఉత్పత్తి కోసం సిద్ధంగా ఉందని కూడా బూమ్ పేర్కొంది.


ఇక ఓవర్‌చర్ గురించి బూమ్ ఫౌండర్ మరియు సీఈఓ బ్లేక్ షెల్ మాట్లాడుతూ, 'దశాబ్దాలుగా ఏవియేషన్ రంగం అనేది ఓ పెద్ద ఎత్తును చూడలేదు. ఓవర్‌చర్ దాని రూపకల్పనలో విప్లవాత్మకమైనది. ఇంకా ఇది దూరం గురించి మనం ఆలోచించే విధానాన్ని కూడా ప్రాథమికంగా మారుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా 600 కంటే ఎక్కువగా ఉన్న విమాన మార్గాలతో, ఈ ఓవర్‌చర్ సూపర్‌సోనిక్ విమానం కోట్లాది మంది ప్రయాణీకులకు ప్రపంచాన్ని చాలా దగ్గరగా అందుబాటులోకి తెస్తుంది' అని ఆయన చెప్పారు.ఇక బూమ్ నార్త్‌రోప్ గ్రుమ్మన్ (B2 స్టెల్త్ బాంబర్‌గా ప్రసిద్ధి చెందినది)తో ఒక మైలురాయి భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా ఇది యూఎస్ ప్రభుత్వం అలాగే దాని మిత్రదేశాల కోసం ఓవర్‌చర్ సూపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్  ప్రత్యేక మిషన్ వేరియంట్‌లను అభివృద్ధి చేయడానికి కూడా కలిసి పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: