అందుబాటు ధరలో ఆకట్టుకుంటున్న మారుతి ఎస్‌-ప్రెస్సో!

Purushottham Vinay
ఇక మారుతి సుజుకి ఇండియా కొత్త ఎస్‌-ప్రెస్సోను లాంచ్‌ చేసింది. 1.0 లీటర్ల నెక్స్ట్ జెన్ K-సిరీస్‌లో 2022ఎస్‌-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్టు కంపెనీ సోమవారం నాడు ప్రకటించింది.ఇంకా అలాగే సుమారు 1.44 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. పాత ఎస్‌-ప్రెస్సోతో పోలిస్తే, ఫీచర్లను బాగా అప్‌డేట్‌ చేసి, ధరను సుమారు 71,వేల రూపాయలు పెంచడం జరిగింది.అలాగే అత్యాధునిక ఇంజీన్‌ ఇంకా ఎక్కువ మైలేజీతో మైక్రో-SUVగా తీసుకొచ్చింది. స్టార్ట్-స్ట్రాప్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ వీవీటీ ఇంజన్, మెరుగైన ఇంధన-సామర్థ్యం ఇంకా అదనపు ఫీచర్లు కస్టమర్లకు ఆకర్షణీయమైన డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నామని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్‌ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించడం జరిగింది.ఇంకా అలాగే 1.0L డ్యూయల్ జెట్, ఐడిల్-స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో డ్యూయల్ వీవీటి ఇంజన్‌తో కొత్త S-ప్రెస్సోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ కొత్త మోడల్ 4 ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది.అలాగే సరికొత్త భద్రతా ఫీచర్లతో స్టాండర్ట్‌, LXi, Vxi Vxi వేరియంట్లలో వస్తుంది.ఇక దీని ధర వచ్చేసి రూ. 4.25 లక్షల నుంచి రూ. 5.99 లక్షల మధ్య ఉంటుంది.ఇంకా దీని ఇంజీన్‌ 5,500rpm వద్ద 65bhp శక్తిని, 3,500rpm వద్ద 89Nm గరిష్ట టార్క్‌ను కూడా ఉత్పత్తి చేయగలదు.


అలాగే సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎకానమీ 25.30 కిలోమీటర్ల మైలేజీ, అందిస్తుందని, అయితే మాన్యువల్ వెర్షన్ 24.76kmplని ఆఫర్ చేస్తుందని కూడా మారుతి కంపెనీ వెల్లడించింది.అలాగే స్టాండర్డ్, Lxi, Vxi Vxi+. మాన్యువల్ శ్రేణి ప్రారంభ ధర రూ. 4.25 లక్షలు రూ. 5.49 లక్షల వరకు ఉంటుంది. అలాగే మరోవైపు, ఏజీఎస్‌ గేర్‌బాక్స్ వరుసగా రూ. 5.65 లక్షలు ,రూ. 5.99 లక్షల ధర కలిగిన Vxi , Vxi+ వేరియంట్‌లతో మాత్రమే అందుబాటులో ఉంది.ఇంకా అలాగే 5-స్పీడ్ మాన్యువల్ AGS(ఆటో-గేర్ షిఫ్ట్), ఎంట్రీ-లెవల్ టాల్-బాయ్ హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ప్రీ-టెన్షనర్లు, ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్‌ ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ ఇంకా అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్‌ తోపాటు, హ్యాచ్‌బ్యాక్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, వాయిస్ కన్సోల్, ట్విన్ ఛాంబర్ హెడ్‌ల్యాంప్‌లు ఇంకా అలాగే డైనమిక్ సెంటర్ కన్సోల్‌ స్మార్ట్ ప్లే స్టూడియో లాంటివి దీని ప్రధాన ఫీచర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: