స్కార్పియో-ఎన్: టెస్ట్ డ్రైవ్స్ స్టార్ట్.. కానీ?

Purushottham Vinay
దేశీయ వాహన తయారీ సంస్థ అయిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) ఇటీవల భారతీయ మార్కెట్లో తన కొత్త స్కార్పియో-ఎన్ కారుని విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్స్ కూడా ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాం.ఇక కంపెనీ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ టెస్ట్ డ్రైవ్స్ ని ప్రారంభించింది. అయితే ఇక ఇది కేవలం దేశం మొత్తం మీద ఇప్పుడు కేవలం 30 నగరాల్లో మాత్రమే ప్రారంభించింది. అయితే ఈ నెల 15 నాటికి దేశవ్యాప్తంగా కూడా టెస్ట్ డ్రైవ్స్ ప్రారభించబడతాయి. ప్రస్తుతం ఈ టెస్ట్ డ్రైవ్స్ ఢిల్లీ, బెంగుళూరు, ముంబై ఇంకా కలకత్తా వంటి నగరాలలో ప్రారంభమవుతాయి. కావున వినియోగదారులు టెస్ట్ డ్రైవ్ కోసం సమీప డీలర్‌షిప్‌కి గానీ లేదా ఆన్‌లైన్‌లో గాని ముందుగానే నమోదు చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏ వేరియంట్ ఇంకా ఏ ఇంజిన్ కలిగిన కారుని టెస్ట్ చేయాలనుకునుటున్నారు అనేది కూడా ముందుగానే నమోదులో పేర్కొనవచ్చు.ఇక ఈ స్కార్పియో-ఎన్ బుకింగ్స్ కూడా ఈ నెల 30 వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిసింది. దీని డెలివరీలు పండుగ సీజన్ లో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది.


దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త స్కార్పియో-ఎన్ జెడ్2, జెడ్4, జెడ్6, జెడ్8 ఇంకా జెడ్8ఎల్ అనే ఐదు ట్రిమ్స్ లో లభిస్తుంది. ఇక వీటి ప్రారంభ ధరలు రూ. 11.99 లక్షలు కాగా ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది. ఇవి పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ లో మనకు అందుబాటులో ఉన్నాయి.మహీంద్రా స్కార్పియో-ఎన్ అనేది 'డీప్ ఫారెస్ట్, నపోలి బ్లాక్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, డాజ్లింగ్ సిల్వర్, రాయల్ గోల్డ్ ఇంకా అలాగే గ్రాండ్ కెన్యాన్' అనే 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇవన్నీ కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి.ఇక ఈ కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ అద్భుతమైన డిజైన్ కలిగి మంచి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త కారు  డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సి-షేప్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇంకా అలాగే కొత్త లోగో వంటివి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: