హీరో మోటోకార్ప్: జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి!

Purushottham Vinay
భారత దేశ ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన 2022 జూన్ నెల అమ్మకాల నివేదికలను అధికారికంగా విడుదల చేసింది. ఇక ఈ గణాంకాల ప్రకారం కంపెనీ అమ్మకాలు మునుపటి ఏడాదికంటే కూడా 3.35 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలిసింది. అయితే కంపెనీ మొత్తం అమ్మకాల గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక హీరో మోటోకార్ప్ గణాంకాల ప్రకారం,ఈ 2022 జూన్ నెలలో మొత్తం 4,84,867 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. అయితే హీరో కంపెనీ ఇదే నెల గత సంవత్సరం అంటే 2021 జూన్ నెలలో కేవలం 4,69,160 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు తెలిపింది. ఇక దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు అనేవి 2021 జూన్ కంటే కూడా 2022 జూన్ లో పెరిగాయి.ఇక గణాంకాల ప్రకారం, హీరో మోటోకార్ప్ మొత్తం దేశీయ విక్రయాలు 2022 జూన్ నెలలో 4,63,210 యూనిట్లుగా తెలిసింది. అయితే 2021 జూన్ నెలలో కంపెనీ  దేశీయ విక్రయాల మొత్తం 4,38,514 యూనిట్లు.


అలాగే ఇక సెగ్మెంట్ల వారీగా అమ్మకాలను గమనిస్తే, 2021 జూన్‌లో విక్రయించిన మొత్తం 4,41,536 యూనిట్లతో పోలిస్తే 2022 జూన్‌లో మోటార్‌సైకిళ్ల విక్రయాలు వచ్చేసి 4,61,421 యూనిట్లకు పెరిగాయి.హీరో మోటోకార్ప్ స్కూటర్స్ సేల్స్ విషయానికి వస్తే, కంపెనీ 2022 జూన్ నెలలో మొత్తం 23,446 స్కూటర్లను విక్రయించింది.ఇక అదే సమయంలో 2021 జూన్‌లో కంపెనీ  మొత్తం 27,624 యూనిట్లను విక్రయించింది. స్కూటర్ అమ్మకాల్లో కంపెనీ కొంత తగ్గుదలను కూడా నమోదు చేసింది.ఇక హీరో మోటోకార్ప్ FY 2023 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ - జూన్ 2022) 13.90 లక్షల యూనిట్లను విక్రయించింది, ఇది మొత్తం 11.89 లక్షల యూనిట్లతో పోలిస్తే, ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి 2022) నుండి 17% వృద్ధిని నమోదు చేయడం జరిగింది. ఇంకా అలాగే కంపెనీ 10.25 లక్షల యూనిట్లను విక్రయించిన మునుపటి ఆర్థిక సంవత్సరం (FY22) త్రైమాసికం కంటే కూడా మంచి వృద్ధిని నమోదు చేయగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: