వావ్.. మారుతీ ఈకోలో మరిన్ని ఫీచర్లు!

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' దేశీయ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం చాటుకోవడానికి ఎప్పటికప్ప్పుడు కొత్త కొత్త వాహనాలను రిలీజ్ చేస్తోంది. అంతే కాకుండా కంపెనీ తన పాత మోడళ్లను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే 'మారుతి సుజుకి  ఈకో' ఎమ్‌పివి కార్ ని కూడా అప్డేట్ చేయడానికి సన్నద్ధమవుతోంది.ఇండియన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ తో ముందుకు సాగిన 'మారుతి ఈకో' ఈ జులై నెలలో నిలిపివేయబడే అవకాశం ఉంది. అయితే కంపెనీ దీనిని మరిన్ని అధునాతన హంగులతో మళ్ళీ రానున్న పండుగ సీజన్ లో విడుదల చేసే ఛాన్స్ ఉంది. 'మారుతి ఈకో' 2010 వ సంవత్సరంలో భారతీయ విఫణిలో ప్రారంభమైంది.ఇక ఈ మారుతి ఈకో భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా విపరీతమైన అమ్మకాలు చేపట్టగలిగింది.


ఇండియన్ మార్కెట్లో ఈ MPV ఎక్కువ అమ్మకాలు పొందటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది 'మల్టీ పర్పస్ వెహికల్'. ఈ కార్ చూడటానికి పెద్దదిగా ఉండటమే కాకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.ఇండియన్ మార్కెట్లో మారుతి ఈకో కార్ ఎక్కువగా డెలివరీ చేయడానికి ఇంకా అలాగే ట్రావెల్ సెగ్మెంట్‌లోని కస్టమర్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇది చాలా తక్కువ ధర వద్ద లభ్యమవుతుంది. ఇంకా అలాగే మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. కాబట్టి మార్కెట్లో మంచి విజయం పొందింది.మారుతి ఈకో MPV కార్ ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి ఇది బలమైన లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఇది 7-సీట్, రియర్ వీల్ డ్రైవ్ ఇంకా అలాగే రెస్పాన్సివ్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. ఇక కంపెనీ ఈ ఈకోను సిఎన్‌జి మోడల్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: