న్యూ 2022 మారుతి ఎర్టిగా విడుదల.. ధర, పూర్తి వివరాలు!

Purushottham Vinay
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) తమ కొత్త 2022 ఎర్టిగా (2022 Ertiga) ఎమ్‌పివి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు రిఫ్రెష్డ్ డిజైన్ ఇంకా ఫీచర్లతో పాటుగా కొత్త ఇంజన్ ఇంకా అలాగే కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక భారత మార్కెట్లో కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా (2022 maruti Suzuki Ertiga) ధరలు రూ.8.35 లక్షల నుండి స్టార్ట్ అవుతాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.కొత్త 2022 ఎర్టిగా ఎమ్‌పివి అప్‌డేటెడ్ వెర్షన్ మొత్తం 11 విభిన్న వేరియంట్‌లలో మనకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 4 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్‌లు ఇంకా అలాగే 3 ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన పెట్రోల్ వేరియంట్‌లు ఇంకా 2 సిఎన్‌జి వేరియంట్‌లు (మ్యాన్యువల్ మాత్రమే) ఇంకా 1 'టూర్' పెట్రోల్ వేరియంట్ ఇంకా అలాగే 1 'టూర్' సిఎన్‌జి వేరియంట్‌లు ఉన్నాయి.


ఇక కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఎమ్‌పివి ఎక్స్టీరియర్ డిజైన్‌లో కొత్త గ్రిల్ ఇంకా అలాగే కొత్త అల్లాయ్ వీల్స్ మినహా వేరే ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రధానమైన మార్పులన్నీ ఇంటీరియర్ ఇంకా అలాగే ఇంజన్‌లో చేయబడ్డాయి. ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది 7 విభిన్న ఎక్స్టీరియర్ కలర్లలో కస్టమర్స్ కి అందుబాటులోకి వచ్చింది. అలాగే వీటిలో పెరల్ మెటాలిక్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ, డిగ్నిటీ బ్రౌన్, స్ప్లెండిడ్ సిల్వర్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్ ఇంకా అలాగే మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో డిగ్నిటీ బ్రౌన్ ఇంకా అలాగే స్ప్లెండిడ్ సిల్వర్ కలర్ ఆప్షన్లు కొత్తగా ప్రవేశపెట్టబడినవి.ఇక ఈ సరికొత్త  2022 ఎర్టిగాలో 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్ ఇంకా అలాగే లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్‌లు (ఆటోమేటిక్ వేరియంట్‌లో), ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్, సుజుకి కనెక్ట్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, సీట్ బ్యాక్ రిక్లైనర్ ఇంకా అలాగే ఫ్లాట్ ఫోల్డ్ ఆప్షన్‌తో కూడిన 50:50 స్ప్లిట్ థర్డ్ రో సీట్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: