గూగుల్ : అలా చేస్తే ఉద్యోగులందరికి ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్స్!

Purushottham Vinay
కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఉద్యోగులు ఇంకా అలాగే కంపెనీలు పనిచేసే తీరు పూర్తిగా మారిపోయింది. ఉద్యోగుల భద్రత కోసం కంపెనీలు ఇంటి వద్ద నుండే పనిచేసుకునే (వర్క్ ఫ్రమ్ హోమ్) సౌకర్యాన్ని కూడా కల్పించాయి. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ మాత్రం అలానే కొనసాగుతోంది. యజమానుల టెన్షన్ లేకుండా ఉద్యోగులు హాయిగా ఇంటి నుండి పనిచేసుకుంటుంటే, ఆ కంపెనీలు కూడా తమ నిర్వహణ ఖర్చులు తగ్గాయిలే అని అనుకుంటున్నాయి.ఇక ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి, మెల్లిగా మునుపటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కంపెనీలు కూడా తమ ఉద్యోగులను కార్యాలయాలకు రమ్మని పిలిపిస్తున్నాయి. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని అంతర్జాల దిగ్గజం అయిన గూగుల్ (Google) కూడా ఇప్పుడు తమ ఉద్యోగులు ఇక ఇంటి సౌకర్యాన్ని వదిలి కార్యాలయానికి రావడం స్టార్ట్ చెయ్యాలని కోరింది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి వచ్చేలా ప్రేరేపించడానికి, గూగుల్ వారికి ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కూడా అందిస్తోంది.ఇక గూగుల్ కంపెనీ ఇందుకోసం కొత్త 'రైడ్ స్కూట్' (Ride Scoot) ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు అమెరికాకు చెందిన ఇ-స్కూటర్ కంపెనీ ఉనాగి (Unagi) తో ఓ భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకుంది.


ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉనాగి బ్రాండ్‌కి చెందిన స్టైలిష్ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ 'మోడల్ వన్' (Model One) ను నెలవారీ చందా (మంత్లీ సబ్‌స్క్రిప్షన్) కి సంబంధించిన పూర్తి ధరను రీయింబర్స్ చేయడానికి గూగుల్ ముందుకు వచ్చింది. ఉద్యోగులు అంతరాయం లేకుండా ఆఫీసులకు వచ్చి వెళ్లడానికి గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.ఇక అమెరికన్ మార్కెట్లో ఉనాగి మోడల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Unagi Model One) ధర వచ్చేసి 990 డాలర్లుగా ఉంటుంది. అంటే మనదేశ కరెన్సీలో అయితే దీని విలువ దాదాపు రూ. 75,000 లకు పైగా ఉంటుంది. ఉద్యోగులు ఇంత మొత్తాన్ని ఒక్కసారిగా చెల్లించడం కష్టం కాబట్టి, ఉనాగి ఇంకా అలాగే గూగుల్ కంపెనీలు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో ముందుకు వచ్చాయి. ఉద్యోగులు ప్రతినెలా 44.10 డాలర్ల ఈఎమ్ఐ‌ని చెల్లిస్తూ ఇంకా వన్‌టైమ్ పేమెంట్‌గా 50 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ డబ్బు మొత్తాన్ని కూడా గూగుల్ కంపెనీ తమ ఉద్యోగులకు పూర్తిగా రీయింబర్స్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: