కేవలం కి.మి.14 పైసలతో వెళ్లే ఎలక్ట్రిక్ స్కూటర్!

Purushottham Vinay
ఇక మన దేశంలో దాదాపు 137 రోజుల తర్వాత మళ్లీ పెట్రోల్ ధరలు బాగా పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరల పెంపు జోలికి రాని ఆయిల్ కంపెనీలు, ఇప్పుడు ఒక్కసారిగా వినియోగదారుల జేబులను కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాయి. నవంబర్ 2021 తర్వాత పెట్రోల్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. తాజాగా లీటరు పెట్రోల్ పై 80 పైసలు రేటు పెరిగింది. దీంతో చాలా రాష్ట్రాల్లో కూడా లీటరు పెట్రోల్ రేటు రూ.111 దాటిపోయింది. ఇది ఇంతటితో ఆగదని ఇక రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.ఇక దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత నుండి పెట్రోల్ ధరలు భారీగా హైక్ అవ్వడం ప్రారంభించాయి. దీంతో తట్టుకోలేని వినియోగదారులు ఇప్పుడు పెట్రోల్ ద్విచక్ర వాహనాలకు స్వస్తి పలికి,ఇక ఎలక్ట్రిక్ టూవీలర్లపై వైపు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అనేది ఒక్కసారిగా జోరందుకుంది.


ఇక ఈ డిమాండ్ కు తగినట్లుగా పలు కంపెనీలు కూడా కొత్త కొత్త ఉత్పత్తులతో మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు.ఇక తాజాగా, క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) అనే ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ 'క్రేయాన్ ఎన్వీ' (Crayon Envy) పేరుతో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 64,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ (గంటకు 25 కిమీ టాప్ స్పీడ్) అని, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపటానికి రిజిస్ట్రేషన్ కానీ ఇంకా అలాగే లైసెన్స్ కానీ అవసరం లేదని కంపెనీ తెలిపింది.ఇక క్రేయాన్ మోటార్స్ ఇదివరకు క్రాయన్ స్నో ప్లస్ (Crayon Snow+) అనే లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా మార్కెట్లో రిలీజ్ చేసింది. కాగా, కంపెనీ ఇప్పుడు తమ ప్రోడక్ట్ లైనప్ ను మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త క్రేయాన్ ఎన్వీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను రెడీ చేసింది. క్రేయాన్ ఎన్వీ ఈవీ (Crayon Envy EV) కంపెనీ మొత్తం కూడా నాలుగు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసింది. ఇక ఇందులో వైట్, బ్లాక్, బ్లూ ఇంకా అలాగే సిల్వర్ కలర్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: