సూపర్ ఫీచర్స్ తో రాబోతున్న వ్యాగన్ఆర్..

Purushottham Vinay
కొత్త వ్యాగన్ఆర్ కార్ అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్లో సందడి చెయ్యడానికి రాబోతుంది. ఇక దీని సూపర్ డూపర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో పాటు ఇంకా డ్యూయల్-టోన్ గ్రే మెలాంజ్ ఫ్యాబ్రిక్‌తో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో సిస్టమ్‌తో  వస్తుంది. అలాగే 4 స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్, ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ ఇంకా అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.ఇక మారుతి వ్యాగన్ఆర్ 2022 ఫేస్‌లిఫ్ట్ గతం కంటే ఇప్పుడు చాలా ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను పొందుతుంది.ఇక అవి ఏంటంటే..హిల్ హోల్డ్ అసిస్ట్ (స్టాండర్డ్), డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, EBDతో కూడిన ABS, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెక్యూరిటీ అలారం, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, బజర్‌తో సీట్ బెల్ట్ రిమైండర్ ఇంకా అలాగే సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.


ఇంకా ఫోర్స్ లిమిటర్ ఇంకా అలాగే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ అండ్ చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాక్‌తో సహా మొత్తం 12 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు అనేవి ఇందులో ఉంటాయి.ఇక ఈ హ్యాచ్‌బ్యాక్ కార్ 1.0-లీటర్ K10C పెట్రోల్ అండ్ 1.2-లీటర్ K12N పెట్రోల్ (90bhp/113Nm) ఇంజన్‌తో కస్టమర్లకు అందించబడుతుంది.ఇక ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మాన్యువల్ అండ్ 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. Idle Start Stop టెక్నాలజీతో అందించబడిన కొత్త DualJet ఇంజన్ 25.19 kmpl మైలేజీని కూడా ఇస్తుంది. ఇక అలాగే ఈ మోడల్ లైనప్ తదుపరి దశలో సి‌ఎన్‌జి వెర్షన్‌తో కూడా లాంచ్ చేయనున్నారు.ఇక ఈ కొత్త 2022 మారుతి వ్యాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ కార్ ధర వచ్చేసి దాదాపు రూ. 10,000 నుండి రూ. 15,000 వరకు పెరగవచ్చు. ప్రస్తుతం, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలలో వచ్చేసి రూ. 5.18 లక్షల నుండి రూ. 6.58 లక్షల వరకు ఉంది. అలాగే ఈ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగో (tata tiago) ఇంకా అలాగే హ్యుందాయ్ శాంత్రో (hyundai santro) వంటి కార్లతో పోటీపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: