ఇండియా మార్కెట్లో డుకాటి మోంస్టర్.. ధర, వివరాలు..

Purushottham Vinay
ఇక ఇండియా మార్కెట్లో బైక్ లవర్స్ కోసం కొత్త Ducati Monster (డుకాటి మోన్‌స్టర్) బైక్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ కొత్త Ducati Monster బైక్ ప్రారంభ ధర వచ్చేసి మార్కెట్లో రూ. 10.99 లక్షలు వుంది.ఇక ఈ కొత్త బైక్ బుకింగ్స్ కూడా కంపెనీ ఇప్పటికే ప్రారంభించడం జరిగింది.ఇక ఈ కొత్త బైక్ కొనుగోలు చేయాలనే కస్టమర్లు ఆ కంపెనీ వెబ్‌సైట్ లో కానీ లేదా దానికి సంబంధించిన డీలర్‌షిప్ లో కానీ బుక్ చేసుకోవచ్చు. ఇక అలాగే Ducati Monster గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Ducati Monster రెండు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి స్టాండర్డ్ వేరియంట్ ఇంకా డుకాటి మోన్‌స్టర్ ప్లస్ వేరియంట్ అందుబాటులో వుంది. ఇక వీటి ధరలు విషయానికి వస్తే..వరుసగా రూ. 10.99 లక్షలు, ఇంకా రూ. 11.24 లక్షలు (ఎక్స్ షోరూమ్) వుంది.

ఇక ఈ కొత్త Ducati Monster బైక్ అనేది చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా ఇంకా అప్డేటెడ్ ఫీచర్స్ అలాగే మంచి పరికరాలను కూడా కలిగి ఉంటుంది.ఇక ఈ కొత్త Ducati మోంస్టర్ బైక్ హెడ్‌ల్యాంప్ లు పూర్తిగా అదిరిపోయే ఎల్ఈడి లైటింగ్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఇక అంతే కాకుండా ఈ బైక్ లో 'బైసన్-బ్యాక్' ప్రొఫైల్‌ తో కూడిన కొత్త ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ ఇంకా సన్నటి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అలాగే ఎల్ఈడి టెయిల్ లైట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.ఇక Ducati Monster  రియర్ ప్రొఫైల్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇక ఈ బైక్ వెనుక స్పోర్టీవ్ నెస్ అనేది పెంపొందించడానికి చాలా సన్నగా ఉంది. ఇక ఈ సూపర్ బైక్ ఒక నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైక్ కాబట్టి ఈ బైక్ డిజైన్‌లో ఎక్కువగా కట్స్ లేదా క్రీజ్ లైన్స్ అనేవి ఉండవు. అయినా కాని చూడ్డానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.ఇక ఈ కొత్త సూపర్ బైక్ లో కొత్త బిఎస్ 6 కంప్లైంట్ 937 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంకా ట్విన్ సిలిండర్ ఇంజన్‌ ను కూడా ఉపయోగించారు. ఇది మాక్సిమమ్ 110 బిహెచ్‌పి పవర్ ఇంకా 93 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇంజిన్ కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మిక్స్ చేయబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: