హోండా కార్లపై అదిరిపోయే ఆఫర్స్..

Purushottham Vinay
హోండా కార్ కంపెనీ తన కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్స్ ని ఇస్తుంది.హోండా కంపెనీ కార్ కొనాలనుకునే కస్టమర్లు దాదాపు 57000/- దాకా ఆదా చేసుకోవచ్చు.ఇక నివేదికల ప్రకారం, ఈ నెలలో ఎక్కువగా అమ్ముడైన కాంపాక్ట్ సెడాన్ Amaze  పాత BS6 మోడల్‌పై రూ. 57,044 వరకు అఫర్ కస్టమర్లకు అందుబాటులో ఉంది.అలాగే కొత్త honda Amaze కొనుగోలుపై కస్టమర్లు ఇప్పుడు దాదాపు రూ. 18,000 వరకు కూడా ఆదా చేయవచ్చు. ఇది మార్కెట్లో 7 వేరియంట్లలో అందుబాటులో వుంది. అంతేగాక ఇది మాన్యూవల్ ఇంకా ఆటోమాటిక్ గేర్ బాక్స్ లలో అందుబాటులో వుంది.Honda Amaze ధర వచ్చేసి రూ. 6.32 లక్షల నుంచి రూ. 9.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.Honda కంపెనీ ఇప్పుడు honda City 4 వ జనరేషన్ ఇంకా 5 వ జనరేషన్ మోడళ్లపై డిస్కౌంట్‌లు అందిస్తుంది. honda City 5 వ జనరేషన్ పై రూ. 37,708 ఇంకా 4 వ జనరేషన్ మోడల్ పై రూ. 22,000 డిస్కౌంట్ అనేది లభిస్తుంది.4 వ జనరేషన్ ధర వచ్చేసి రూ. 9.30 లక్షలు కాగా, 5 వ జనరేషన్ మోడల్ ధర వచ్చేసి రూ .11.16 లక్షలు(ఎక్స్-షోరూమ్) వుంది.

ఇక honda WR-V కొనుగోలుపై కస్టమర్లు రూ .39,998 వరకు ఆదా చేయవచ్చు. ఇక దీని ధర వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ .8.76 లక్షల నుండి రూ .9.89 లక్షల వరకు ఉంటుంది.అలాగే honda Jazz కార్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు ఏకంగా రూ. 39,947 డిస్కౌంట్ అందిస్తుంది.ఇక దీని ధర వచ్చేసి మార్కెట్లో రూ .7.65 లక్షల నుండి రూ. 9.89 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.ఇండియా మార్కెట్లో కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ కంపెనీ అమ్మకాలను మరింతగా పెంచే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు. ఇది కొనుగోలుదారులకు చాలా ఎక్కువ డబ్బును అదా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: