ఈ ఆటోని ఛార్జ్ చెయ్యాల్సిన పనిలేదు.. నడుపుతుంటే అదే ఛార్జ్ అవుతుందట..

Purushottham Vinay
ఇక దేశంలో పెట్రోల్ ధరలు బాగా భగ్గుమంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి మక్కువ చూపుతున్నారు. ఇక దేశంలో ఇప్పటికే, ఎలక్ట్రిక్ టూవీలర్లు బాగా వినియోగంలోకి రాగా, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా బాగా పెరుగుతోంది.ఈ ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ అనేది ఇప్పుడు ఇంతటితో ఆగకుండా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇంకా అలాగే కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ వైపుకు కూడా కదులడం జరుగుతుంది.ఇక సాధారణంగా ఆటోరిక్షాలు అటు పట్టణాల్లో అయినా ఇటు పల్లెటూర్లలో అయినా మంచి ప్రజా రవాణా సాధానాలుగా ఉన్నాయి.మంచి ప్రాచుర్యం పొందిన ఈ ఆటోరిక్షాలు కేవలం మనదేశంలోనే కాదు, ఇతర ఆసియా దేశాల్లో కూడా బాగా ఆదరించబడ్డాయి ఇంకా ఆదరించబడుతున్నాయి.

అయితే, ఇప్పటి దాకా వాడుతున్న ఆటోరిక్షాలలో ఎక్కువ శాతం పెట్రోల్ ఇంకా డీజిల్ పెట్రోల్ తో నడిచేవే కాగా  కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మాత్రం సిఎన్‌జి ఇంకా బ్యాటరీ పవర్‌తో నడిచే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే,ఫ్యూచర్ లో ఆటోరిక్షాలన్నీ కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోకి మారిపోయే సూచనలు అనేవి ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి.ఇక తాజాగా, శ్రీలంక కంపెనీ 'Vega Innovations' (వేగ ఇన్నోవేషన్స్) అనే ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ 'ETX' (ఈటిఎక్స్) పేరుతో ఓ సరికొత్త ఆటోరిక్షాను రూపొందించడం జరిగింది. ఇది ఆషామాషీ ఆటోరిక్షా మాత్రం కాదు, ఇదొక అదిరిపోయే స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో కనిపించే ఈ Vega ETX ఆటోరిక్షాను కంపెనీ సరికొత్త సోలార్ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేయడం జరిగింది.ఇక కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఈ ఆటో కేవలం సోలార్ ప్యానెళ్ల సాయంతోనే గరిష్టంగా 64 కిలోమీటర్ల దూరం ఈజీగా ప్రయాణించగలదు. కంపెనీ అందులో అధునాతన LFP బ్యాటరీ ప్యాక్ లను ఉపయోగించడం జరిగింది.ఇక ఇప్పుడు ETX ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్రోటోటైప్ దశలో ఉన్నందు వలన కంపెనీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇంకా వెల్లడించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: