వాహనదారులకు శుభవార్త.. ఇక నుంచి వాహనాన్ని రిజిస్టర్ చేసే పనిలేదు..

Purushottham Vinay
వాహనదారులకు ఇప్పుడు మంచి శుభవార్త అందింది. మీరు మీ వాహనంతో పాటుగా ఎప్పుడూ కూడా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి బదిలీ అవుతున్నట్లయితే.. ఇక మీరు మీ పాత వాహనాన్ని కొత్త రాష్ట్రంలో కొత్తగా రీ-రిజిస్టర్ చేసుకోవాల్సిన పని లేకుండా ఉండేలా భారత రోడ్డు రవాణా ఇంకా రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH India) ఓ కొత్త నిబంధనను తీసుకురావడం జరిగింది.ఇక ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. కేంద్ర రోడ్డు రవాణా ఇంకా రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకారం చూసినట్లయితే..ప్రభుత్వం కొత్త వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఇది భారత్ సిరీస్ (BH - Series) పేరుతో కూడా ఉంటుంది.మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసినట్లయితే ఒక వాహనదారుడు భారతదేశంలోని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు అతను BH - సిరీస్ మార్కు కలిగిన వాహనం కనుక కలిగి ఉంటే, అతనికి కొత్తగా బదిలీ అయిన రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ అనేది ఇక అవసరం ఉండదు.

ఇక ప్రస్తుతం ఈ సదుపాయం దేశ రక్షణ సిబ్బంది, కేంద్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే రాష్ట్ర పిఎస్‌యులు ఇంకా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో కార్యాలయాలు కలిగిన ప్రైవేటు రంగ కంపెనీలకు స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది.ఇక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో 'ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు స్టేషన్ బదిలీ అనేది అందుబాటులో ఉంది. ఇక ఇటువంటి పథకాలు చాలా మంది ఉద్యోగుల మనస్సులో అసహనాన్ని సృష్టించడం జరిగింది.ఇక మోటార్ వాహనాల చట్టం ప్రకారం 1988 సెక్షన్ 47 ప్రకారం, వాహనం రిజిస్టర్ చేసిన రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రంలో నైనా ఒక వ్యక్తి 12 నెలలకు మించి ఆ వాహనాన్ని ఉంచడానికి అనుమతి లేదు. కాబట్టి 12 నెలల లోపే వాహనదారులు తమ పాత వాహనాన్ని కొత్త రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.' అని తెలిపడం జరిగింది.ఇక ఈ సమస్యకు పరిష్కారంగా, ఐటి ఆధారిత సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే BH - సిరీస్‌ ను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపడం జరిగింది.ఇక ఇప్పుడు ఈ చర్య వలన తరచూ రాష్ట్రాలు బదిలీ అయ్యే ఉద్యోగులు వాహనాల రిజిస్ట్రేషన్ బదిలీ విషయంలో  ఉపశమనాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: