ఆకట్టుకుంటున్న హీరో మాస్ట్రో ఎడ్జ్ 125..

Purushottham Vinay
ప్రముఖ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌ కి ఇండియాలో ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దేశవ్యాప్తంగా తన 125సీసీ మోడళ్లను పెంచాలని హీరో కంపెనీ యోచిస్తోంది. ఇక ఇటీవల హీరో కంపెనీ గ్లామర్‌ బైక్‌కు అప్‌డేట్‌ తెచ్చిన కొన్ని రోజులకే స్కూటీ డివిజన్‌లో మాస్ట్రో ఎడ్జ్‌ 125ను అప్‌డేట్‌ చేస్తూ ఇంకా సరికొత్త ఫీచర్లతో మాస్ట్రో ఎడ్జ్‌ 125 బైక్‌ను హీరో మోటార్‌ కార్ప్‌ రిలీజ్‌ చేయడం జరిగింది.ఇక ఈ బైక్‌ను సరికొత్తగా రెండు రకాల కలర్‌ వేరియంట్లతో ఇండియా మార్కెట్‌లోకి హీరో కంపెనీ లాంచ్‌ చేసింది.ఇక కస్లమర్లకు హీరో కంపెనీ ఈ మోడల్ లో ప్రిస్మాటిక్‌ ఎల్లో ఇంకా ప్రిస్మాటిక్‌ పర్పుల్‌ కలర్‌ వేరియంట్స్  రూపంలో న్యూ మాస్ట్రో ఎడ్జ్‌ కస్టమర్లకు అందుబాటులో తీసుకొని రానుంది.

ఇక ఈ న్యూ మాస్ట్రో ఎడ్జ్‌ 125 బైక్‌ బ్లూటూత్‌ కనెక్టివిటీని ఇంకా ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌లైట్‌ అలాగే డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ ఇంకా టర్న్‌-బై- టర్న్‌ నావిగేషన్‌ అలాగే డిజిటల్‌ స్పీడో మీటర్‌ ఇంకా కాల్‌ ఆలర్ట్‌తో మార్కెట్లోకి రానుంది.ఇక మాస్ట్రో ఎడ్జ్‌ 125 డ్రమ్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర వచ్చేసి రూ. 72,250 ఉండగా ఇంకా డిస్క్‌ వేరియంట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర వచ్చేసి రూ. 76,500 వుంది. ఇక కనెక్టెడ్‌ వేరియంట్‌ ఎక్స్‌ షో రూమ్‌ ధర వచ్చేసి రూ. 79,750గా నిర్ణయించడం జరిగింది.ఇక ఈ ధరలు అన్ని కూడా ఢిల్లీ నగరంలో అందుబాటులో ఉంటాయి.ఇక మాస్ట్రో ఎడ్జ్ 125 'ఎక్స్‌సెన్స్ టెక్నాలజీ'తో 124.6 సిసి బిఎస్ 6 కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోటారుతో మార్కెట్లో రానుంది. ఇది ఇంజన్ 9బీహెచ్‌పీ సామర్థ్యంతో 7,000 ఆర్‌పీఎమ్‌ను అండించడం జరిగింది. అలాగే 5,500 ఆర్‌పీఎమ్‌ వద్ద గరిష్టంగా 10.4ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తోంది.అలాగే టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఇంకా సుజుకి యాక్సెస్ 125 అలాగే హోండా గ్రాజియా 125  అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 బైక్‌లకు పోటిగా ఈ బైక్ నిలవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: