మరోసారి సుజుకి ఇంట్రూడర్ బైక్ ధర పెంపు..

Purushottham Vinay
ఇక ఇటీవలే తమ జిక్సర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు ఇంకా యాక్సెస్ 125 స్కూటర్ల ధరలను పెంచిన జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌ సైకిల్ ఇండియా ఇప్పుడు తాజాగా తమ ఇంట్రూడర్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది.ఇక ఇప్పుడు పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు కారణంగా ఈ బైక్ ధరలను పెంచినట్లు కంపెనీ తెలిపడం జరిగింది.ఇక ఈ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అందిస్తున్న ఈ ఎంట్రీ లెవల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ సుజుకి ఇంట్రూడర్ ధరలను రూ.2,100 మేర పెంచడం జరిగింది.ఇక తాజా ధరల పెంపు తరువాత ఈ మోటార్‌సైకిల్ ధర వచ్చేసి ఇప్పుడు రూ.1,26,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లకు చేరుకుంది.ఇక పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయట. సుజుకి ఇంట్రూడర్ ధరలో మార్పు మినహా బైక్‌లో మాత్రం ఎలాంటి మార్పులు అనేవి లేవు.ఇక ఈ మోటార్‌ సైకిల్ యొక్క డిజైన్ అలాగే ఫీచర్లు కూడా మునుపటి లాగానే ఉంటాయి.

ఇక విశాలమైన హ్యాండిల్ బార్ ఇంకా భారీ ఫ్యూయెల్ ట్యాంక్ కవర్ల స్ప్లిట్ సీట్లు అలాగే డ్యూయల్ మఫ్లర్ ఎగ్జాస్ట్ ఇంకా లో-స్లంగ్ డిజైన్‌తో ఇది మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుందట.ఇక ఈ మోటార్‌సైకిల్‌లో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది కూడా లభిస్తుంది. ఇంకా ఈ బైక్ లో పిలియన్ కంఫర్ట్ కోసం బ్యాక్‌రెస్ట్ సపోర్ట్ కూడా ఉంటుందట. ఇది బ్రాండ్ యొక్క లేటెస్ట్ ఎస్ఈపి (సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్) టెక్నాలజీ అలాగే ఫ్యూయెల్ ఇంజెక్షన్‌ టెక్నాలజీలను కూడా కలిగి ఉంటుందట.ఇక సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్ (ఎస్ఈపి) టెక్నాలజీతో తయారైన ఈ మోటారు సైకిల్‌ను మెరుగైన పనితీరును అందిస్తూనే అలాగే మంచి ఇంధన సామర్థ్యాన్ని కూడా అందిస్తుందట.ఈ బైక్ సింగిల్-ఛానల్ ఏబిఎస్ ఫీచర్‌తో స్టాండర్డ్‌గా లభిస్తుందట.ఇక ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్ యూనిట్ అలాగే ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు అనేవి చాలా బాగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: