మార్కెట్లో న్యూమహీంద్ర బొలెరో నియో..

Purushottham Vinay
ఇక మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థగా బాగా ప్రసిద్ధి చెందిన మహీంద్రా అండ్ మహింద్ర ఎట్టకేలకు ఇండియా మార్కెట్లో కొత్త బొలెరో నియోని విడుదల చేయ్యడం జరిగింది.ఇక ఈ కార్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 8.48 లక్షలుగా వుంది. ఇక మహీంద్రా కంపెనీ కొత్త బొలెరో నియో ప్రస్తుతం టియువి 300 పై ఆధారపడి ఉంటుంది.ఇక అంతే కాకుండా ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ ని కలిగి ఉంటుంది.ఇక ఈ కొత్త కారు బొలెరో యొక్క స్టాండర్డ్ మోడల్‌తో పాటు అమ్మబడుతుంది.ఇక కొత్త మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీని ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి కంపెనీ డెలివెరీలను కూడా ఏ సమయంలోనైనా అంటే త్వరలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఈ కొత్త మహీంద్రా బొలెరో నియో మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందట. ఇక అవి ఎన్ 4, ఎన్ 8, ఎన్ 10 ఇంకా ఎన్ 10(ఓ) వేరియంట్స్.

ఇక ఈ కార్ల ధరల విషయానికి వస్తే ఎన్ 4 ధర వచ్చేసి రూ.  8.48 లక్షలు ఉండగా , ఎన్ 8 ధర వచ్చేసి రూ. 9.48 లక్షలు ఇంకా అలాగే ఎన్ 10 ధర వచ్చేసి రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది.ఇక ఎన్ 10(ఓ) ధరని మాత్రం మహీంద్రా కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మహీంద్రా బొలెరో నియో ఎంతో ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇక ఇందులో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి హెడ్‌లైట్ అలాగే టెయిల్ లైట్లు ఇంకా స్క్వేర్ ఫాగ్ లైట్లు అలాగే ముదురు రంగు స్కిడ్ ప్లేట్‌లతో కొత్త బంపర్ లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ గ్రిల్‌ను పొందుతుంది.ఇక ఈ సరికొత్త బొలెరో నియోలో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇంకా అలాగే ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ (మాన్యువల్), కీలెస్ ఎంట్రీ ఇక అంతేగాక పవర్ అడ్జస్టబుల్ ORVM లు, ఎసి వంటి ఫీచర్స్ ఈ కారులో ఉంటాయి. మొత్తానికి ఈ కార్ వాహనదారునికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: