పెరిగిన బజాజ్ అవేంజర్ ధరలు...

Purushottham Vinay
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీగా ప్రసిద్ధి చెందిన బజాజ్ ఆటో, ఇండియా మార్కెట్లో ఎన్నో ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది దేశంలో మిగతా బైక్స్ కంటే కూడా అత్యంత ప్రజాదరణ పొందింది.ఇక ఇటీవల కాలంలో కూడా బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా మార్కెట్లో విడుదల చేసి తనకంటూ ఒక గుర్తింపును సాధిస్తుంది.ఇక ఇదిలా ఉండగా బజాజ్ ఆటో ఇటీవల తన కంపెనీ ద్విచక్ర వాహనాల ధరను ఇండియా మార్కెట్లో పెంచినట్లు అధికారికంగా తెలిపడం జరిగింది. ఇక ఇందులో బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ ఇంకా అవెంజర్ 220 క్రూయిస్ బైక్‌లు ఉన్నాయి.ఇక కంపెనీ ఆఫీషియల్ గా ప్రకటించిన ధరల విషయానికి వస్తే.. ఇప్పుడు మార్కెట్లో బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ ధర వచ్చేసి 1,07,30 రూపాయలు కాగా, బజాజ్ అవెంజర్ 220 క్రూయిస్ బైక్ ధర 1,31,046 రూపాయల వరకు ఉంటుంది.
ఇక ఈ బైక్స్ కి కేవలం పెరిగిన ధరలే తప్ప, ఇక ఇందులో ఎటువంటి మార్పులు చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది.అలాగే బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ బైక్ విషయానికి వస్తే...ఇక ఇందులో 160 సిసి సింగిల్ సిలిండర్ ఇంకా ఎయిర్ కూల్డ్ ఇంజన్ కూడా ఉంటుంది. ఈ బైక్ ఇంజిన్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కూడా అందించబడింది. ఇక ఈ బైక్ లో ఉన్న ఇంజిన్ 14.8 బిహెచ్‌పి పవర్ ఇంకా 13.7 ఎన్ఎమ్ టార్క్ ను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో మిక్స్ చేయబడి ఉంటుంది.ఇక బజాజ్ అవెంజర్ క్రూయిస్ 220 బైక్‌ విషయానికి వస్తే, ఈ బైక్ లో 220 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ బిఎస్ 6 ఇంజన్ తో అమర్చడం జరిగింది. ఇక ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద ఇంకా 18.7 బిహెచ్‌పి పవర్, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 17.5 ఎన్ఎమ్ టార్క్ ను ఈ బైక్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైక్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో మిక్స్ చేయబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: