పెరిగిన సుజుకి జిక్సర్ ధర..

Purushottham Vinay
జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, ఇండియన్ మార్కెట్ లో ప్రస్తుతం అమ్ముతున్న కొన్ని రకాల బైక్స్ ధరలను పెంచింది. ఉత్పాదక వ్యయం పెరిగిన కారణంగా సుజుకి కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది.సుజుకి జిక్సర్ లైనప్ మోటార్‌ బైక్స్ ధరలను కంపెనీ పెంచింది.అందులో 155సిసి ఇంకా 250సిసి జిక్సర్స్ నేక్డ్ అలాగే ఫుల్-ఫేర్డ్ వెర్షన్ల ధలను కంపెనీ సవరించింది. సుజుకి జిక్సర్ 250 ఇంకా ఎస్ఎఫ్ 250 ధరలు సుమారు రూ.3,500/-  మేర పెరగగా,అందులో 155సిసి వేరియంట్ల ధరలు రూ.2,000/- మేర పెరిగడం జరిగింది.

ఇక ధరల పెరిగిన తరువాత ప్రస్తుతం మార్కెట్లో సుజుకి జిక్సర్ మోటార్‌సైకిళ్ల ధరలు(హైదరాబాద్ ఎక్స్ షో రూమ్ )వచ్చేసి ఇలా ఉన్నాయి:

సుజుకి జిక్సర్ 150 ధర - రూ.1,21,091/-

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 150 ధర - రూ.1,31,593/-

సుజుకి జిక్సర్ 250 ధర - రూ 1,73,494/-

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర - రూ.1,84,193/-

సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోటో జిపి ధర - రూ.1,84,994/-

సుజుకి మోటార్‌ సైకిల్ ఇండియా ఈ సంవత్సరం తమ బైక్స్ ధరలను పెంచడం ఇది రెండవసారి. గత ఫిబ్రవరి నెల లో కూడా సుజుకి తమ అన్ని జిక్సర్ మోటార్‌సైకిళ్ల ధరలను రూ.2,000/- దాకా పెంచిన సంగతి తెలిసినదే.ఇండియా 250 సిసి క్వార్టర్ లీటర్ మోటార్‌సైకిల్ విభాగంలో సుజుకి జిక్సర్ మోడల్ ఎంతో అద్భుతమైన మోడల్‌గా ఉంటుంది. దీని డిజైన్ ఇంకా పెర్ఫార్మెన్స్‌ల పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది. సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ స్పోర్ట్స్ టూరింగ్ విభాగంలో లభిస్తుంది. ఇంకా సుజుకి జిక్సర్ 250 బైక్ అయితే నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే ప్లాట్‌ఫాంపై బిల్డ్ చేయబడ్డాయి.ఇక జిక్సర్ బైక్‌లోని 249సిసి ఎస్ఓహెచ్‌సి 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఎక్కువగా 26.5 బిహెచ్‌పి శక్తిని ఇంకా 22.2 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మిక్స్ చేయబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: