డ్రైవింగ్ లైసెన్స్ కి ఇక నో టెస్ట్ డ్రైవ్...

Purushottham Vinay
ఇక డ్రైవింగ్ చెయ్యాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి.. ఇకపై లైసెన్స్ కావాలంటే టెస్ట్ అవసరం లేదు. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం.. ఏదైనా డ్రైవింగ్ సెంటర్లలో ట్రైనింగ్ పూర్తి చేస్తే చాలట.హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాలట. ఇక అప్పుడే.. డ్రైవింగ్ లెసెన్స్ జారీ కోసం డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు ఉంటుంది.అందువల్ల డ్రైవింగ్ లైసెన్స్ పొందే సమయంలో ప్రత్యేకంగా డ్రైవింగ్ టెస్టింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.ఇక ఇది వరకే డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్ కోసం రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చెయ్యడం జరిగింది.అలా డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు అనేవి ధృవీకరిస్తే..డ్రైవింగ్ టెస్టింగ్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఓ మెలిక వుంది.

ఇక ట్రైనింగ్ సెంటర్లకు మాత్రం పూర్తి స్వేచ్చను ఇవ్వరు.కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గత ఏడాది డిసెంబర్‌ నెలలోనే ముసాయిదా రూపొందించింది. ఈ డ్రైవింగ్ కోర్సు లైట్ మోటార్ వెహికల్ కోసం అందించబోతున్నారు. ఈ కోర్సు వ్యవధి 29 గంటలు మాత్రమే.ఇంకా గరిష్టంగా నాలుగు వారాలు పాటు ఉంటుందట.ఇక ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీసు అనేది కూడా ఉంటుంది.ఇక తక్కువ సమయంలో డ్రైవింగ్ లో నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో పొందేలా ఈ కోర్సు అందిస్తారు. అలా డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల నుంచి పొందే అక్రిడేషన్ గడువు ఐదేళ్ల వరకు ఉంటుందట. ఇక ఆ తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాలట. డ్రైవింగ్ శిక్షణ ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొనడం జరిగింది. 2025 సంవత్సరం నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలనే లక్ష్యంతో ఈ ముసాయిదాను ముందుకు తీసుకురావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: