కార్ మైలేజ్ పెరగాలంటే ఏం చెయ్యాలి?

Purushottham Vinay
కారు సురక్షితంగా ఉండి ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాటర్ సర్వీసింగ్ చెయ్యాలి. వాటర్ సర్వీసింగ్ కోసం వాహనాలను ఖరీదైన వాటర్ వాష్‌ల వద్దకు తీసుకువెళ్లాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంటిలోనే చాలా నీట్ గా వాష్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే నీరు, షాంపూ వంటి వాటితోనే వాహనాలను చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.ఇలా కనీసం వారానికి ఒక్కసారైనా వాహనాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే, మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి.ఇక అవేంటో తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు పాటించండి.వారంలో కనీసం ఒక్కసారైనా మీ కారును శుభ్రం చేసుకుంటూ ఉండటం వలన మీ కారు ఎక్స్టీరియర్ చాలా క్లీన్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తూ ఉంటుంది.ఇక అంతేకాదు, కారు పెయింట్ మన్నికను కూడా ఇది బాగా పెంచుతుంది. అలాగే కారుపై బురద, ధూళి ఎక్కువ కాలం నిల్వ ఉండటం వలన కారు బయటి భాగాలను తుప్పు పట్టేలా చేస్తుంది.అందుకే కార్ వాష్ చేసుకోవాలి.

ఇక ఈ మధ్య కాలంలో, కార్ల కంపెనీలు తమ కార్లపై మంచి పెయింట్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇవి తొందరగా చెదిరిపోకుండా, తుప్పు పట్టకుండా ఉండేలా ఉంటాయి. కారుని బాగా వాష్ చేసిన తర్వాత, వ్యాక్సింగ్ చేసుకుంటే కారుపై ఉండే పెయింట్ మరింత ఎక్కువ కాలం మన్నుతూ, కార్ బాగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇలా వాక్సింగ్ చేయటం వలన కారుపై దుమ్ము, ధూళి వలన వచ్చే సన్నపాటి గీతలు కూడా పడే ప్రమాదం ఉండదు.ఇక కారుకు ధూళి ఇంకా బురద అంటుకోవడం కూడా దాని ఇంధన సామర్థ్యాన్ని చాలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.దాని వలన మీ కారు మైలేజ్ కూడా తగ్గిపోతుంది.ఇక మీ కారు నుండి మీకు మంచి మైలేజ్ కావాలంటే మీరు దానిని చాలా శుభ్రంగా ఉంచడం ఎంతో అవసరం.కార్లని శుభ్రం చేసుకోవడం వలన కార్ మైలేజ్ సుమారు 10 శాతం వరకూ పెరుగుతుంది.కాబట్టి రెగ్యులర్ గా కారుని శుభ్రం చేసుకుంటూ వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: