హ్యుందాయ్ నుంచి మరో కొత్త కారు లాంఛ్.. ధర ఎంతంటే ?

Satvika
భారత దేశంలో ఎన్నో రకాల కార్లు ఉన్నాయి. వాహనదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని కార్ల కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు ఉన్న కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందులో ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ కాస్త ముందుంది. సరికొత్త హంగులతో పాటుగా సరికొత్త ఫీచర్లు ఉన్న కార్లను సరసమైన ధరలకే వినియోగదారులకు అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో కొత్త కార్లను అందించింది.. ఈ కంపెనీ కార్లకు మంచి ఫీచర్లు ఉండటంతో మార్కెట్ ఓ భారీ సేల్స్ ను అందుకుంది.  ఎప్పుడు కొత్త కార్లు వచ్చిన కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్, లుక్ తో మరో కొత్త కారును మార్కెట్ లోకి  విడుదల చేసింది.  



కారు ఫీచర్స్ విషయానికొస్తే.. అల్కాజార్ కొత్త వర్సెన్ కారును మార్కెట్ లోకి  విడుదల చేసింది. ఈ కారు వివరాలు ఇలా ఉన్నాయి, మాన్యువల్ పెట్రోల్ ట్రిమ్స్ 14.5 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి, ఆటోమేటిక్ వేరియంట్లు 14.2 కిలోమీటర్లు. డీజిల్ మాన్యువల్ ట్రిమ్స్ 20.4 కిలోమీటర్లు వస్తుంది. ముందు వచ్చిన కార్లతో పోలిస్తే సీటింగ్ నిర్మాణం కూడా అదిరిపోయింది. మూడు వేరియంట్లలో ఈ కారు మార్కెట్ లో లభిస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ తో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. భారత దేశంలోని అన్ని హ్యుందాయ్ కార్ల షో రూమ్ లో ఉన్నాయి. షో రూమ్ లో వీటి ధర 16 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.
ఆ ధర కూడా అందరికీ అందుబాటులో ఉంది.  హ్యుందాయ్ ఇప్పటికే వేదిక, క్రెటా, టక్సన్ మరియు కోనా ఎలక్ట్రిక్ వంటి మోడళ్లతో దేశంలో ఎస్‌యూవీ స్థలంలో ముందుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 వంటి వాటితో పోటీపడే కొత్త మోడల్ అభివృద్ధికి సుమారు రూ .650 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. 
ఈ కంపెనీ సేల్స్ కూడా మంచి లాభాలలో దూసుకుపోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: