భారత్ లోకి బెంజ్ మేబాచ్ GLS600.. దరెంతంటే?

Purushottham Vinay
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీని విడుదల చెయ్యడం జరిగింది.మెర్సిడెస్-మేబాచ్ లైనప్ నుండి వస్తున్న ఫస్ట్ ఎస్‌యూవీ మోడల్ ఈ జిఎల్‌ఎస్ 600. ఈ కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ధర మన ఇండియా మార్కెట్లో రూ. 2.43 కోట్లు.మన మార్కెట్లో విడుదలైన కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 గురించి మరిన్ని విషయాలు గురించి తెలుసుకుందాం..
మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన న్యూ వేరియంట్ కార్ . దీని స్టాండర్డ్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600తో కంపేర్ చేస్తే, ఈ మేబాచ్ వెర్షన్ ఎస్‌యూవీ అనేది కొత్త అప్ డేటెడ్ కార్. ఈ స్పెషల్ జిఎల్‌ఎస్ 600 మేబాక్ కార్ ఎక్స్టీరియర్ ఇంకా ఇంటీరియర్లలో కూడా చాలా అప్డేట్స్ జరిగాయి.ఇక ఈ మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీ కార్ లో క్రోమ్‌లో ఫినిష్ చేసిన ఎక్స్టీరియర్ ట్రిమ్స్ ఉన్నాయి. వీటిలో పెద్ద వర్టికల్ స్లాట్ గ్రిల్, విండో లైన్, సైడ్-స్టెప్, అలాగే ముందు రియర్ బంపర్‌లపై డిజైన్ ట్వీక్స్, రూఫ్ రెయిల్స్ ఇంకా ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు.

ఈ న్యూ లగ్జరీ ఎస్‌యూవీ కార్ లో పెద్ద 22 ఇంచెస్ లేదా 23 ఇంచెస్ బ్రష్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉండటం విశేషం.ఇక అలానే ఈ కార్ లో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన విండో పిల్లర్స్ ఇంకా రూఫ్, ‘మేబాచ్' బ్రాండ్ లోగో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక ఈ సువర్ కారులో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే,దీనిలో యాక్టివ్ బాడీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది కెమెరా ద్వారా రోడ్ స్కాన్ చేసి, దానికి అనుగుణంగా సస్పెన్షన్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేయడం విశేషం.ఈ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వలన ఈ ఆల్ట్రా-ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీ కార్ లో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఇక మీరు ఈ కార్ కోనేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: