బెనెల్లి నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. సూపర్..
ఈ క్యూజె7000డి బైక్‌లో మిడ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉండటం విశేషం.ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ కి స్టాండర్డ్ గేర్‌బాక్స్ కూడా వుంది.చైన్ ఫైనల్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రాలకు పవర్ ని పంపుతుంది. ఈ కొత్త కియాంగ్‌జియాంగ్ క్యూజె7000డి బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఇది ముందు భాగంలో యుఎస్‌డి ఫోర్కులు అలాగే వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉండటం విశేషం అని చెప్పాలి.ఈ సరి కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో డిజిటల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక ఫ్యూయల్ ట్యాంక్ ప్రాంతంలో ఈ ఎలక్ట్రిక్ బైక్‌కి ఎక్కువ స్టోరేజ్ ప్లేస్ కూడా ఉంటుంది. ఈ స్టోరేజ్ ప్లేస్ లో హెల్మెట్ పెట్టుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఇక ఈ హై-సెట్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు అలాగే సెంటర్-సెట్ ఫుట్‌పెగ్‌లతో ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉండటం విశేషం అని చెప్పాలి.