బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్.. ఇండియాలో డ్యుకాటి నుంచి సూపర్ మోడల్ విడుదల..

Purushottham Vinay
ఇక ఇటాలియన్ సూపర్ బైక్ కంపెనీ డ్యుకాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో కోట్ల బైక్ లవర్స్ కి ఫేవరెట్ బ్రాండ్. ఇక గతేడాది నవంబర్ నెలలో ఆవిష్కరించిన తమ సరికొత్త ఆఫ్-రోడ్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్ 'డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4'ను కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో కూడా రిలీజ్ చేయబోతోంది. మరికొన్ని వారాల్లోనే ఈ అడ్వెంచర్ టూరింగ్ బైక్ బుకింగ్స్, అలాగే దీని సేల్స్ ప్రారంభం కావచ్చని సమాచారం అందుతుంది.ఈ జూన్‌లో డ్యుకాటి ఇండియాలో మొత్తం మూడు కొత్త మోడళ్లను తీసుకు రానుంది. వీటిలో మల్టీస్ట్రాడా వి4 కూడా ఒకటనే చెప్పాలి.ఇక ఇండియా మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 ఇప్పుడు ఈ ఇటాలియన్ బ్రాండ్ అయిన ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరింగ్ బైక్ గా నిలుస్తుంది.జూన్ 2021 నాటికి మల్టీస్ట్రాడా వి4 ను భారత మార్కెట్లో లాంచ్ చేయాలని కంపెనీ చూస్తోంది.

ఇక మల్టీస్ట్రాడా వి4 తో పాటు, డ్యుకాటి ఈ నెలలో డయావెల్ 1260 ఇంకా పానిగల్ వి4 బైక్స్ ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతుంది.ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరర్ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి..స్టాండర్డ్, వి4 ఎస్ ఇంకా వి4 ఎస్ స్పోర్ట్. మల్టీస్ట్రాడా వి4 బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోని పానిగల్ వి4 మోటార్‌సైకిల్‌కు శక్తినిచ్చే సరికొత్త ఇంజన్‌తో పనిచేస్తుంది. అయితే, కంపెనీ ఈ ఇంజన్‌ను అడ్వెంచర్ టూరర్  ఫీచర్లకు తగ్గట్లుగా మోడిఫై చేసింది.ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 320 మిమీ డ్యూయల్-సెమీ ఫ్లోటింగ్ డిస్క్‌లతో పాటు రేడియల్‌గా అమర్చిన బ్రెంబో మోనోబ్లోక్ ఫోర్-పిస్టన్ కాలిపర్స్ అలాగే ముందు భాగంలో రేడియల్ మాస్టర్ సిలిండర్ ద్వారా జరుగుతుంది.అలాగే వెనుక భాగంలో, బ్రెంబో టూ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 265 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: