హోండా యూనికార్న్ పై అదిరిపోయే ఆఫర్...

Purushottham Vinay

హోండా మోటార్ బైక్స్ కి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక హోండా కంపెనీ వారు తమ స్కూటర్స్ అలాగే బైక్ మోడళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నారు. ఇక ఇటీవల హోండా యునికార్న్ బైక్ పై ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ ఆఫర్ ప్రకారం హోండా యునికార్న్ బైక్‌పై క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. హోండా ప్రకటించిన ఈ ఆఫర్ ఏంటంటే..ఇప్పుడు కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం కొత్త హోండా యునికార్న్ బైక్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు 5% వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ లభిస్తుంది. కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.

వినియోగదారుడు దీనిని గమనించాలి. కంపెనీ ఇస్తున్న ఈ ఆఫర్ ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే చెల్లుతుంది. అంతే కాకుండా కనీస లావాదేవీ విలువ రూ. 40,000 అని కూడా కంపెనీ ప్రకటించింది.హోండా కంపెనీ అందిస్తున్న ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ 2021 జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త హోండా యునికార్న్ బైక్‌పై అందించే క్యాష్‌బ్యాక్ ఆఫర్ గురించి మరింత తెలుసుకోవడానికి దగ్గర్లో వున్న హోండా మోటార్‌సైకిల్ ఇంకా స్కూటర్ ఇండియా డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

ఇక ఈ కొత్త హోండా యూనికార్న్ బైక్ విషయానికి వస్తే..ఈ కొత్త బైక్‌లో 162.7 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్‌ వద్ద 12.5 బిహెచ్‌పి శక్తిని ఇంకా 5,500 ఆర్‌పిఎమ్‌ వద్ద 14 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో యాడ్ అయ్యి ఉంటుంది.అంతేగాక ఈ బైక్‌ ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ ఇగ్నిస్ బ్లాక్ వంటి కలర్స్ లో ఇండియా మార్కెట్లో అమ్మకానికి ఉంది.ఇక ఈ బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు అలాగే వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ అమర్చబడి ఉంటుంది.మరి ఇంకెందుకు ఆఫర్ వున్నప్పుడే ఈ కొత్త బైక్ ని సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: