ఏంది భయ్యా.. ఈ బైక్ ఫీచర్స్ మాములుగా లేవుగా.. !

Satvika
ఆటో మొబైల్ కంపెనీలు జనాలను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నారు.. ప్రస్తుతం ఎలెక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. ఈ మేరకు కంపెనీలు అన్నీ కూడా వాటిని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అతి తక్కువ ఖర్చుతో చాలా ఎలక్ట్రికల్ బైక్ లు ఇప్పటికే మార్కెట్ లో వచ్చినప్పటికీ ఇంకా చాలా సౌకర్యవంతంగా ఎక్కువ కీలోమీటర్లు ప్రయాణించడానికి వీలుగా బైక్ను నగరానికి చెందిన స్టార్ట్ఫ్ ఉటన్ ఎనర్జియా అనే సంస్థ రూపొందించింది. 


ఈ బైక్ కు కేవలం ఒక గంటపాటు చార్జ్ చేస్తే దాదాపు 65 కిలోమీటర్ల వరకు ఈ బైక్ పై ప్రయాణించడానికి వీలవుతుందని అంటున్నారు సంస్థ యజమానులు.. పొర్టీఫైవ్ అనే వెరైటీ పేరుతో ఈ బైక్ లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఆన్ లైన్ రిజిస్ట్రే షన్ ప్రారంభమైంది.గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్ ఒక్కసారి చార్జీ చేస్తే దాదాపు 65 నుంచి 70 కిలో మీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో పాటు చార్జీ చేయాడానికి కేవలం ఒక్కటి లేదా రెండు యూనిట్ పవర్ మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు కంపెనీ ప్రతినిధిలు. అంటే కేవలం 5 రూపాయలే అన్నమాట..


65 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి వీలవుతుందని. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఏ బైక్ కూడా ఇంత సౌకర్యవంతంగా ఇంత తక్కువ ధరలో లేదని ఉటన్ ఎనర్జిజా సంస్థ లోని ఈ బైక్ ను తయారు చేసిన హర్షవర్దన్ తెలిపారు. 20x4 సైజ్ లో ఉండే ఈ బైక్ టైర్లు మనం రోజు వాడే బైక్ టైర్ల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. అందువలన ఈ బైక్ ఎలాంటి ప్రతికూల మార్గాల్లో అయిన ఈజీ ప్రయాణించడానికి కుదురుతుందని అంటున్నారు.. ఈ బైక్ ధర విషయానికొస్తే.. 35 వేలుగా కంపెనీ నిర్ణయించింది.కానీ కంపెనీ వెబ్ సైట్ లో మాత్రం 10 వేల లోపు ఉంది. మరి ఏ రేటు తో అందుబాటులోకి వస్తుందో చూడాలి..రెండు కలర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అందరినీ ఆకట్టుకొనే విషయమేంటంటే ఫోన్ చార్జర్ తో ఛార్జ్ చేయొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: