ఎస్‌యూవీ వ్రాంగ్లర్‌ను జీప్‌ ఇండియా కార్ల సందడి మాములుగా లేదుగా..

Satvika
భారత దేశంలో ఎన్నో ఆటో రకాల ఆటో మొబైల్ కంపెనీ కార్లు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఒక్కో కంపెనీ నుంచి అదిరిపోయే ఫీచర్లతో ఎన్నో రకాల కార్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న కారు ఎస్‌యూవీ వ్రాంగ్లర్‌ను జీప్‌ ఇండియా.. ఈ కారును బుధవారం మార్కెట్ లోకి విడుదల చేశారు. విడుదల అయిన ఒక్కరోజులోనే ఎన్నో విధాలుగా మంచి డిమాండ్ ను అందుకున్నాయి.  కేవలం ఒక్కరోజులోనే భారీ సెల్ ను అందుకోవడం గమనార్హం.. ప్రజల అనుకూలతగా ఈ కారు మార్కెట్ లోకి  రాబోతుంది ..

ఈ కారుకు ఉన్న ఫీచర్లు ఎంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.. తొలిసారి దేశీయంగా తయారు చేసిన ఎస్‌యూవీ వ్రాంగ్లర్‌ను జీప్‌ ఇండియా బుధవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.53.90 లక్షలు(ఎక్స్‌షోరూం). గత వెర్షన్ల తో పోలిస్తే దీని ధర దాదాపు రూ.10లక్షల వరకు తగ్గింది. భారత్‌ లో తయారు చేయడం వల్లే ధర తగ్గించగలిగామని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఇది కేవలం పెట్రోల్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటు లో ఉంది. అన్‌లిమిటెడ్‌, రుబికాన్‌ అనే రెండు వేరియంట్లలో లభించనుంది.

పుణెలోని రంజన్‌గావ్‌ ప్రాంతంలో ఉన్న ఉత్పత్తి కేంద్రం లో దీన్ని తయారు చేశారు. 2022 లో గ్రాండ్‌ చెరోకీ ఎస్‌యూవీని కూడా ఇక్కడే అసెంబుల్‌ చేయాలని ఆలోచిస్తున్నారు. 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ తో వచ్చే వ్రాంగ్లర్‌ అత్యధికంగా 262 హెచ్‌పీ శక్తిని, 400 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు... ఖర్చు కూడా అందుబాటు లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆటో మేటిక్‌ హెడ్‌లైట్స్‌, ఎల్‌ఈడీ ఇంటీరియర్‌ లైట్స్‌, ఆటో డిమ్మింగ్‌ రేర్‌వ్యూ మిర్రర్‌, 8.3 అంగు ళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, లెదర్‌ ఫినిష్డ్‌ డ్యాష్‌బోర్డ్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఉందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: