అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి లాంఛ్ కానున్న మారుతి సుజుకీ స్విఫ్ట్...!

Satvika
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ లలో అగ్రగామి సంస్థగా మారుతికి మంచి పేరు ఉంది.. ఈ కంపెనీ నుంచి వచ్చిన అన్ని కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే, ఇప్పుడు మరో కారును లాంఛ్ చేయబోతుంది.ఈ కంపెనీ విడుదల చేసిన వాహనాల్లో స్విఫ్ట్ మోడల్ విజయవంతమైంది. తాజాగా ఈ కారు లేటెస్ట్ వర్షన్ ను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది మారుతీ సుజుకీ. ఈ వారం లాంఛ్ చేయాలనే భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ ఈ మోడల్లోని సరికొత్త డిజైన్, ఈ ఫేస్ లిఫ్ట్ చూసేందుకు అచ్చం దీని ముందు మోడల్ లాగే ఉన్నప్పటికీ కొన్ని కీలక మార్పులను చేసింది మారుతీ సుజుకీ.

అయితే పోయిన ఏడాది ఈ కంపెనీ కారును జపాన్ లో విడుదల చేసింది.. అక్కడ విజయవంతం కావడంతో ఇప్పుడు ఇండియాలో లాంఛ్ చేయబోతుంది.హనీకోంబ్ గ్రిల్, క్రోమ్ స్లాట్, ఫ్రంట్ బంపర్, అల్లాయ్ వీల్స్ తో అప్ డేటెడ్ డిజైన్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా రియర్ బంపర్ ను కూడా రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది.సరికొత్త 2021 మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్ దగ్గరకొస్తే బ్లాక్ కలర్లో ఉండి స్పోర్టీ లుక్ తో ఆకట్టుకుంటోంది. సిల్వర్ ఇన్ సెర్ట్స్ వల్ల క్యాబిన్ మరింత ప్రీమియంగా కనిపిస్తోంది.

ఇకపోతే ఈ కారు వేరియంట్ల విషయానికొస్తే..మాత్రం టచ్ స్క్రీన్ డబుల్ డిన్ తో కూడిన ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ను పొందుపరిచారు. ఈ కారుకు సంబంధించి అతిపెద్ద మార్పు ఇంజిన్. ఇందులో 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది SHVS హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ఇంజిన్ ను మారుతీ సుజుకీ బాలేనో మోడల్ నుంచి తీసుకున్నారు. ఈ ఇంజిన్ 82 బీహెచ్ పీకి బదులు 89 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది..మొత్తానికి ఈ కంపెనీ నుంచి రానున్న కారు వాహన ప్రియులకు నచ్చుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: