జీప్ కంపాస్ 2021 వర్షన్ వచ్చేసింది.. ధర ఎంతంటే

Satvika
ప్రముఖ ఆటో మొబైల్స్ ఎప్పుడు ఏదోక కారును మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. ఒక్కో కంపెనీ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే రోజుకో కారు మార్కెట్లో సందడి చేస్తోంది. అయితే ఇప్పుడు మరో కారు సందడి చేస్తుంది. జీప్ కంపాస్ కొత్త వర్షన్ విడుదల అయ్యింది.ఇప్పటివరకు మంచి టాక్ తో దూసుకుపోతుంది. అందరికీ అనువుగా ఉన్న నేపథ్యంలో ఎక్కువగా జీప్ ను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నా ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం.. 


తాజాగా ఈ సంస్థ తన 2021 కంపాస్ ఎస్ యూవీ వర్షన్ ను లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ వాహనం ప్రారంభ ధర వచ్చేసి రూ.16.99 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక హంగులు, పీచర్లతో పాటు ప్రీమియం అప్డేట్లను పొందుపరిచిన ఈ మిడ్ సైజ్ ఎస్ యూవీ ఆకట్టుకుంటోంది. ఎస్ యూవీ ఫీచర్ల దగ్గరకొస్తే ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంపులతో పాటు ఫ్రంట్ బంపర్, సెంట్రల్ ఎయిర్ ఇన్టైక్ పాటు డ్యూయల్ టోన్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పానోరామిక్ సన్ రూఫ్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు లాంటి అప్డేట్లు ఇందులో ఉన్నాయి. 



రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.4-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ 163 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరో ఇంజిన్ 2.0-లీటర్ డీజిల్ యూనిట్ 173 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 350 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ ఎస్ యూవీ 6-స్పీడ్ మ్యానువల్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.. 4 వేరియంట్లలో లభ్యమవుతుంది. స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్ అండ్ మోడల్ ఎస్ వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. టాప్ స్పెక్ అయిన మోడల్ ఎస్ వేరియంట్ ఖరీదు వచ్చేసి రూ.24.49 లక్షలు. ఈ నాలుగు వేరియంట్లు కాకుండా జీప్ సంస్థ తన 80వ వార్షికోత్సవం సందర్భంగా యానివర్సరీ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఢిల్లీ షో రూం లలో సందడి చేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: