టొయోటా లో ఆ కారుకు అంత డిమాండ్ ఎందుకంటే?
పోలిస్తే ఈ కార్లకు ఇండియాలోనే కూడా మంచి టాక్ ఏర్పడింది..అయితే ఈ కంపెనీ కార్లు కొత్త హంగులతో అదిరిపోయే రేటు, ఫీచర్లతో మరో కారును విడుదల చేశారు.. డిమాండ్ పరంగా ప్రస్తుతం కార్లు హవాను కొనసాగిస్తోంది. మరి అంతగా ఈ కార్లలో ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఈ జపాన్ కంపెనీ నుంచి తాజాగా సరికొత్త వాహనం భారత విపణిలో విడుదలైంది. అదే టొయోటా అర్బన్ క్రూజర్. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర వచ్చేసి రూ.8.4 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. ఈ వాహనం టాప్ వేరియంట్ ధర వచ్చేసి రూ.11.3 లక్షలుగా నిర్దేశించింది. ధర తక్కువ ఎక్కువ మన్నిక ఉన్న ఈ కారును చాలా మంది ఇష్టపడుతున్నారు.. మార్కెట్ లో టొయోటా అర్బన్ క్రూజర్ కు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముందుగా ఈ వాహనం పొందాలంటే బుకింగ్ ఫీజుగా రూ.11,000లు చెల్లించాలి...
ధర తక్కువ ఎక్కువ మన్నిక ఉన్న ఈ కార్లకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. మరో విషయమేంటంటే..మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల పనిచేసేలా వారంటీనిచ్చింది టొయోటా. ఈ కాంపాక్ట్ ఎస్ యూవీ మూడు వేరియంట్లో లభ్యమవుతుంది. మిడ్-గ్రేడ్, హై గ్రేడ్, ప్రీమియం గ్రేడ్ వేరియంట్లలో కారు లభిస్తుంది.ఇంజిన్ కూడా విటారా బ్రెజా మాదిరే ఉంది. 1.5-లీటర్ కే-సిరీస్ ఇంజిన్ ను కలిగి ఉండి స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ను అందుబాటులోకి వచ్చింది. లీటరుకు గరిష్ఠంగా 17.03 కిలోమీటర్ల నుంచి 18.76 కిలోమీటర్ల వరకు మైలేజి ఇస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ కారు కు ఇండియా మార్కెట్ లో మంచి పోటీ ఉంది. ఈ ఫీచర్లు ఇంచు మించు ఉండటంతో మహీంద్రా ఎక్స్ యూవీ 300, హ్యూండాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ తో పాటు ఆల్ న్యూ కియా సొనెట్ కారును కలిగి ఉన్నాయి..