ఆగస్ట్ 11న రాబోతున్న ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్... తాజాగా టీజర్ లాంచ్...!
అయితే ఇందుకు సంబంధించి విడుదల కాకముందే భారత్ లో ఒక లక్ష రూపాయల టోకెన్ అమౌంట్ తో స్ట్రీట్ పీపుల్ ఆర్ కోసం ప్రీ-బుకింగ్స్ ను మొదలు పెట్టింది. ఈ బైక్ లో 765 సీసీ, ఇన్ లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 12000 rpm వద్ద 116 bhp శక్తిని విడుదల చేయగలదు. అలాగే 9,400 rpm వద్ద 77 nmటార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ మోడల్ ఆర్ వెరీ ఇంజన్ మినహా, మిగతా అన్ని ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. ఇక ఇందులో ఫీచర్స్ విషయం కొస్తే అనలాగ్ టాకో మీటర్ తో కూడిన ఎల్సిడి మాత్రమే కనబడుతుంది.
ఇక ఈ బైక్లో ట్రైన్ పాడ్ ఎల్ఈడి హెడ్ లాంప్ లతో చాలా అత్యుత్తమంగా కనబడుతోంది. ఇక ఈ బైకు సస్పెన్షన్ విషయానికి వస్తే... ముందు భాగంలో 41 mm ఫోర్క్ లు, అలాగే వెనుక భాగంలో మోనో షాక్ సెటప్ అత్యున్నత స్థాయిలో నిర్మించారు. ఇక ఈ బైక్ షో రూమ్ లో రూ.11.33 లక్షలు గా ఉండవచ్చని అంచనా. ఈ ఇంజన్ స్లిప్ - అసిస్టెడ్ క్లచ్ తో 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పని చేస్తుంది. ఇక బ్రేకింగ్‌ను విషయానికి వస్తే... ఈ మోటార్ సైకిల్ పై ముందు భాగంలో 310 mm డిస్క్ బ్రేక్, అలాగే వెనుకవైపు 220 mm డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.