గ్లోబల్ మార్కెట్ లో టొయోటా యారిస్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరణ...!
జపాన్ దేశానికి చెందిన టయోటా కంపెనీ తన సరికొత్త 20 21 ఫేస్ లిఫ్ట్ మోడల్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. గ్లోబల్ మార్కెట్ లో టొయోటా వియోస్ అనే పేరుతో విక్రయాలు చేపడుతున్నారు. ఈ కారులో ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్లలో భారీ మార్పులు తీసుకువచ్చారు. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కూడా తీసుకువచ్చారు. ఈ కారుకు సంబంధించి ముఖ్యంగా ముందు భాగంలో చాలా మార్పులు చేపట్టారు. ఎల్ ఈడి హెడ్ లైట్స్, డే టైం రన్నింగ్ లైట్స్ ను ఇందులో కొత్తగా చేర్చడం జరిగింది.
ఇక ఈ కారుకు సంబంధించి సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ ను గమనిస్తే... పెద్దగా మార్పు లేదు. ఇదివరకు మోడల్ లాగానే ప్రస్తుతం మోడల్ లో కూడా అలాగే ఉంది. అయితే టైర్లకు సంబంధించి కాస్త మార్పు చేశారు. అలాయ్ వీల్స్ డిజైన్ లో సరళమైన బాడీ లైన్స్ తో డిజైన్ చేశారు. ఇక ఈ కారులో అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆటో లతో పాటుగా, ఆపిల్ కార్ ప్లే సిస్టం ని పొందుపరిచారు. ఇది ఇందులో మొత్తం 7 ఎయిర్ బ్యాగులను, ఎలక్ట్రానిక్ సెలబ్రిటీ కంట్రోల్ లతో కూడిన ఏవీఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇక అంతర్జాతీయంగా విడుదలయ్యే ఈ టయోటా వియోస్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మనకు లభ్యం కానుంది. ఇందులో 1.3 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో మనకు రెండు కార్లు లభించబోతున్నాయి. అయితే భారత మార్కెట్లో కేవలం 1.5 లీటర్ పెట్రోల్ తో నడిచే కారు మాత్రమే లభించనుంది. ఈ కార్ గరిష్టంగా 107 bhp కలిగి ఉండగా, 143 nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. అలాగే ఇందులోని ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పని చేయనుంది.