ఎట్టకేలకు హీరో ఎక్స్ ట్రీమ్ 160R బైక్ లాంచ్ ...!

frame ఎట్టకేలకు హీరో ఎక్స్ ట్రీమ్ 160R బైక్ లాంచ్ ...!

Kothuru Ram Kumar

గత మూడు నెలల నుండి ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఇకపోతే తాజాగా సడలింపులు కారణంగా షోరూంలో తెరుచుకోవడంతో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే ఎప్పుడు నుండో ఎదురుచూస్తున్నా హీరో ఎక్స్ట్రీమ్ 160 ఆర్ మోటార్ సైకిల్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి విడుదల చేసింది సంస్థ. ఇక ఇందులో మనకు రెండు వేరియంట్లలో మోటార్ సైకిల్ లభ్యమవుతుంది. డబుల్ డిస్క్, ఫ్రంట్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో ఈ బైక్ మనకు లభిస్తుంది. ఇక ఈ రెండూ మోడల్స్ కు సంబంధించి ధర కూడా వ్యత్యాసం ఉంది. నిజానికి ఈ మోటార్ సైకిల్ ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రభావంతో మోటార్ సైకిల్స్ ని విడుదల చేయలేక పోయారు. ఇకపోతే ఇందులో ఫ్రంట్ డిస్క్ ధర చూస్తే రూ.99950 గా ఉండగా, మరో వేరియంట్ అయినా డబుల్ డిస్క్ వేరియంట్ ధర చూస్తే రూ. 1.03 లక్ష్యాలుగా కంపెనీ నిర్ధారించింది.

 

 

ఇక ఈ మోటార్ సైకిల్ ఇంజిన్ విషయానికి వస్తే... 163 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ కలిగి ఉండడమే కాకుండా అది 15 బిహెచ్ పి బ్రేక్ హార్స్ పవర్ 14 nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇక ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ తో ఇంజన్ పనిచేస్తుంది. అంతేకాదు ఈ బైక్లో ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. 

 

 

ఇక ఇందులోని ప్రత్యేకతలు ఓ సారి చూస్తే స్పోర్ట్స్ డిజైన్ లుక్కుతో చూడటానికి చాలా స్టైలిష్ గా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి మొదలగు అనేక ఫీచర్లతో ఈ బండి చూడడానికి చాలా బాగుంది. ఇక ఈ బైకు పోటీగా ప్రస్తుతం భారత మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్టిఆర్, అలాగే బజాజ్ కంపెనీ నుండి బజాజ్ పల్సర్ nm 160, సుజుకి జిక్సర్ 150 లాంటి మోటార్ సైకిల్స్ గట్టిపోటీని ఇవ్వనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: