హోండా నుండి కొత్త డియో రిలీజ్..!

shami
హోండా నుండి సరికొత్త స్కూటర్ హోండా డియో 2018 ఆరంభంలోనే మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. స్కూటర్ విభాగంలో వస్తున్న ఈ డియో సరికొత్త అప్డేట్స్ తో అందుబాటులోకి వస్తుంది. 50,296 ప్రారంభ ధరతో వస్తున్న ఈ డియో స్కూటర్ ఎస్.టి.డి వేరియెంట్ ధర 51,292 గా నిర్ణయించింది. 


ఇక హోండా డియో ఎక్సెల్ ధర 53, 292 రూపాయలుగా నిర్ణయించబడింది. 109.19 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ స్కూటర్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నాయి. బిఎస్-4 నామ్స్ తో వస్తున్న ఈ స్కూటర్ 8 బిహెచ్పి పవర్ ఇంకా 8.91 ఎన్.ఎం టార్క్ తో వస్తుంది. 


వి-మాటిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ద్వార గంటకు 83 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ వెళ్తుంది. హోండా డియో కస్టమర్స్ యొక్క అభిరుచిని బట్టి వివిధ కలర్స్ లో అందుబాటులో ఉంటున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం హోండా డియో సూటర్ అనుభూతిని పొందాలనుకునే వారు వెంటనే దగ్గరలో ఉన్న షోరూం ను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: