టొయాటో కొత్త మోడల్ కార్ ప్రియస్..!

shami
వాహనదారుల సంక్షేమార్దం ప్రయాణంలో అలసట లేకుండా తమ ప్రయాణం సుఖమయం అయ్యేలా ప్లాన్ చేస్తూ కంపెనీలన్ని తమ ఉత్పత్తుల్లో బెస్ట్ క్వాలిటీని అందచేయడం జరుగుతుంది. ఇక లక్సరియస్ కార్లలో తమకు తాముగా పోటీ పడుతూ వస్తున్న కంపెనీలు ఇంకా మెరుగైన మోడల్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నారు.


టోయోటా నుండి లేటెస్ట్ కార్ టోయోటా ప్రియస్.. అత్యంత అధునాతన టెక్నాలజీతో మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్న ఈ మోడల్ కార్ హైబ్రిడ్ వర్షన్ తో వస్తుంది. వర్టికల్ షేప్ తో కూడిన హెడ్ ల్యాంప్స్ తో చూడముచ్చటగా ఉన్న ఈ టోయోటా ప్రియస్ వర్టికల్ ఎల్.ఈ.డి ల్యాంపులతో కూడా అమర్చబడింది. ముందు నుండే కాదు సైడ్స్ లో కూడా సెక్సీగా ఉన్న ఈ మోడల్ లో వెనుక భాగం చాలా స్పేస్ తో డిజైన్ చేయబడినది.


అంతేకాదు వీకెండ్ కాంపెయిన్ ట్రిప్ కు సరిపడా డైనింగ్ సామాన్లంటిని కార్ వెనుక భాగంలో పెట్టుకునేలా వెసులుబాటు ఉంది. లాంగ్ డ్రైవ్ కు కూడా ఎంతో సౌకర్యవంతగా ఉన్న ఈ టోయోటా ప్రియస్ కొత్తగా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. కొత్తగా రిలీజ్ చేయబడిన ఈ కార్ టోయోటా అన్ని ఆథ్రైజెడ్ డీలర్స్ దగ్గర అందుబాటులో ఉంది. 39 నుండి 40 లక్షల వరకు దీని రేటు ఉండొచ్చని అంచనా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: