అనుష్క షూటింగ్ కి రాకపోవడానికి కారణం?
అలాంటిది లేకలేక ఇన్నాళ్లకి ఆమె నుండి ఓ సినిమా వస్తోందని తెలిసి అభిమానుల సంతోషానికి అవధులు లేవు. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారు స్వీటీ. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కి ఇప్పటి వరకు హాజరు కాలేదు అనుష్క. అయితే ఇందుకు కారణం కూడా ఆమె అధిక బరువే అట. ఆ మధ్య సైజ్ జీరో సినిమా కోసం చాలా బరువు పెరిగిన స్వీటీ మై స్వీటీ ఆ తరవాత ఎంత ప్రయత్నించినా పెద్దగా బరువు తగ్గడం లేదు. అప్పట్లో బరువు తగ్గడం కోసం ఆస్ట్రేలియా వెళ్లి మరి ట్రీట్మెంట్ తీసుకున్న కొంచం కూడా లాభం లేకపోవడం తో ఇపుడు సహజసిద్దంగా బరువు తగ్గడానికి చాలా కసరత్తులు చేస్తున్నారు.
కాగా ఇప్పుడు కూడా ఇంకా అనుకున్న స్థాయిలో బరువు తగ్గని కారణంగా ఇప్పట్లో షూటింగ్ కి రానని, బరువు తగ్గాకే సెట్స్ కి వస్తానని చెప్పేశారట స్వీటీ. అందుకు దర్శకనిర్మాతలు సైతం అర్దం చేసుకుని ఆమె షెడ్యూల్ ను పక్కన పెట్టి మిగిలిన షూటింగ్ ని తీస్తున్నారు. అయితే అనుష్క షూటింగ్ కి రెడీ అవడానికి ఇంకో రెండు , మూడు నెలలు పట్టేలా ఉందని అంటున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు బరువు పెరగడం , తగ్గడం చాలా సులువుగా చూస్తుంటాం కానీ అదేంటో స్వీటీ మాత్రం బరువు తగ్గడానికి చాలా లేట్ అవుతోంది అంటూ బాధపడుతున్నారు ఆమె ఫ్యాన్స్.