నగ్న చిత్రాలు షేర్ చేసిన హీరోయిన్.. అవి చూస్తే..?
అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తెరమీద ఎంత అల్లరి చేస్తారో, అంతకుమించిన అల్లరి సోషల్ మీడియాలో చేస్తారు. తన బ్రదర్ తో ఆమె చేసేటటువంటి రచ్చ అయితే ఇక చెప్పనక్కర్లేదు. హీరోయిన్ డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఎప్పటికప్పుడు ఆ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అసభ్యకరమైన కామెంట్స్, ఇతర ట్రోలింగ్ మీద కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. వీటితో పాటు సామాజిక అంశాలపై, ఇతర సమస్యలపై కూడా ఆమె మాట్లాడతారు. ప్రస్తుతం మహిళల యొక్క శరీరాకృతి, మహిళలపై జరిగే అఘాయిత్యాలు, వివక్ష గురించి రాసిన ఒక పోస్టును ఆమె సోషల్ మీడియాలో పెట్టేశారు. మహిళలు సన్నగా ఉన్నా, లావుగా ఉన్న, తెల్లగా ఉన్న, నలుపుగా ఉన్న, ఎలా ఉన్నా విమర్శలు చేస్తారు. స్త్రీ ఎలా ఉండాలి, అలా ఉండాలంటూ ఆక్షలు పెడతారు. జీరో సైజులో ఆమె లేదు. కొలతలు సరిగ్గా లేవని, చాలా లావుగా ఉన్నదని రకరకాల కారణాలను చూపిస్తారు. ఇలా అనేక ఆంక్షలు పెడతారు అంటూ ఆమె పోస్టు ద్వారా తెలిపారు.
అనుపమ ఇలాంటి వాటిని పోస్ట్ చేయడంతో అందరూ ఆలోచనలో పడ్డారని చెప్పవచ్చు. వివక్షతో కామెంట్ చేసే కొందరిని మేల్కొల్పే విధముగా ఉన్నటువంటి ఈ పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నయి. ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అనుపమ ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నదని చెప్పవచ్చు.