వావ్.. OLA నుంచి భారీ ఎక్స్చేంజ్ ఆఫర్?

Purushottham Vinay
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఓలా  పెట్రోల్ స్కూటర్ పై భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను కల్పిస్తుంది. అయితే ఈ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను ఎలా పొందాలో? ఇంకా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీ పాత స్కూటర్ ని తీసుకొని మొదటిగా ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ కు దానిని తీసుకెళ్లాలి. అక్కడ ఉండే సిబ్బంది మీ బండి స్థితిని, అది తిరిగిన కిలోమీటర్లను ఇంకా అలాగే కంపెనీను బేరీజు వేసుకుని ధరను నిర్ణయిస్తారు. ఇక ఓలా స్కూటర్ ధరలో నుంచి నిర్ణయించిన ధరను మినహాయించి మిగిలిన డబ్బు మొత్తాన్ని చెబుతారు. అది మీకు సమ్మతమైతే మిగిలిన మొత్తాన్ని చెల్లించి హ్యాపీగా మీరు కొత్త ఓలా స్కూటర్ ను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లవచ్చు.ఓలా ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో బాగా విస్తరించింది.అందుకు దేశవ్యాప్తంగా ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ లే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాలి.


ఈ కంపెనీకి దాదాపు 108 సెంటర్లు దేశంలో ఉన్నాయి. ఇక్కడ ఓలా ఎస్ 1 స్కూటర్ ను మీరు టెస్ట్ రైడ్ చేయవచ్చు. అలాగే ఈఎంఐ ఎంపికలో ఎస్ 1 డాక్యుమెంటేషన్, బ్యాంక్ ఫైనాన్సింగ్ ఇంకా అలాగే స్కూటర్ డోర్ డెలివరీ వంటి సేవలను కూడా మీరు ఈజీగా పొందవచ్చు. ఈ స్కూటర్ రెగ్యులర్ చెక్ అప్ ఇంకా అలాగే సర్వీసింగ్ వంటి సర్వీస్ లను కూడా మీరు పొందవచ్చు.ఇక ఓలా ఎస్ 1 ఆగస్టు 2022లో విడుదల అయ్యింది. పది కంటే ఎక్కువ కలర్స్ లో ఇది మనకు అందుబాటులో ఉంది. రూ.84,999 తక్కువ ధరకు ఇది అందుబాటులో ఉంటుంది. మిగిలిన ట్యాక్స్ ఈ ధరకు అదనమని మీరు గుర్తుంచుకోవాలి.మీకు కావాలనుకుంటే కేవలం రూ.1999 చెల్లించి దీన్ని మీరు ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. ఓ సారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ ఏకంగా 181 కిలో మీటర్లు వెళ్తుంది అలాగే గంటకు మాక్సిమం 116 కిలో మీటర్ల వేగంతో ఈ స్కూటర్ వెళ్తుంది. ఇక అప్డేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈ స్కూటర్ కి ఉన్న ప్రత్యేకత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: