ఇండియన్ మార్కెట్లో బెంట్లీ నుంచి కాస్ట్లీ కార్ విడుదల?

Purushottham Vinay
బ్రిటీష్ లగ్జరీ కార్ల కంపెనీ  'బెంట్లీ' ఇండియన్ మార్కెట్లో 'బెంటైగా ఈడబ్ల్యుబి' (Bentayga EWB) సూపర్ లగ్జరీ కార్ ని విడుదల చేసింది.ఇక ఈ సూపర్ లగ్జరీ కార్ ధర అక్షరాలా రూ.6 కోట్లు.ఈ సూపర్ లగ్జరీ SUV మొత్తం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి అజూర్ ఇంకా అలాగే ఫస్ట్ ఎడిషన్. ఈ కొత్త బెంట్లీ బెంటైగా ఈడబ్ల్యుబి దాని పాత మోడల్స్ కంటే కూడా ఎక్కువ వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ కార్ వీల్‌బేస్‌ పాత మోడల్స్ కంటే 180 మిమీ ఎక్కువగా ఉంది. అందువల్ల రియర్ సీట్ ప్యాసింజర్లు కూడా మంచి జర్నీ ఎక్స్పీరియన్స్ ని పొందవచ్చు.ఇక బెంట్లీ బెంటైగా ఈడబ్ల్యుబి చాలా అద్భుతమైన డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.ఈ SUV ని  4 సీటర్ లేదా 5 సీటర్ ఆప్సన్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 సీటర్ వేరియంట్ రెండు పెద్ద వెనుక సీట్ల మధ్య చిన్న జంప్ సీటు కూడా పొందుతుంది. అయితే కంపెనీ ఇందులో 7 సీటర్ ఆప్షన్ ని మాత్రం అందించలేదు. అయినా కూడా ఇది చాలా మంచి మంచి కంఫర్ట్ అందిస్తుంది.బెంట్లీ బెంటైగా EWB  ఫీచర్స్ లో స్పెషల్ ఫీచర్ ఎయిర్‌లైన్ సీట్. ఇది ప్యాసింజర్  శరీర ఉష్ణోగ్రతను ఇంకా ఉపరితల తేమను గ్రహించి దానికి అనుకూలంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత ఇంకా గాలి ప్రవాహాన్ని అందిస్తుంది.


ఇది స్పెషల్ సీటింగ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఈ సీటింగ్ ఆప్షన్ అనేది అన్ని విధాలా ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉండేలా  డిజైన్ చేయబడి ఉంటుంది.అలాగే ఇందులో ఉండే రియర్ సీట్లు కూడా 40 డిగ్రీల దాకా వంగి ఉంటాయి. ఎక్సట్రా ప్లేస్ కోసం ముందు ప్రయాణీకుల సీటును ముందుకు కదిలించవచ్చు. ఇంకా అంతే కాకుండా ఈ లగ్జరీ SUV లో డిప్లోయబుల్ ఫుట్‌రెస్ట్‌లు, హీటెడ్ ఇంకా కూల్డ్ రియర్ ఆర్మ్‌రెస్ట్‌లను పొందుతుంది. అలాగే వెనుక వైపు ఉన్న ప్రయాణికులు హ్యాండ్‌హెల్డ్ టచ్‌స్క్రీన్ ద్వారా వెనుక సీటు ఫంక్షన్‌లను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఇది కూడా ఇందులో ఉన్న అప్డేటెడ్ ఫీచర్.కొత్త బెంట్లీ బెంటైగా EWB డిజైన్ పరంగా కూడా చాలా బాగా ఉంటుంది. ఈ కార్ లో వర్టికల్ స్లాటెడ్ గ్రిల్ చూడవచ్చు. ఇది ఈ లగ్జరీ SUV కి మరింత అట్రాక్టివ్ లుక్ ఇస్తుంది.అలాగే సైడ్ ప్రొఫైల్ లో 22 ఇంచెస్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇది  చూపరులను చూడగానే ఆకర్శించే విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. మొత్తం మీద ఫీచర్స్ మాత్రమే కాకుండా డిజైన్ కూడా చాలా అప్డేటెడ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: