"బేబమ్మ" కథ ఏంటి అడ్డం తిరిగింది ?

VAMSI
టాలీవుడ్ ఎందరో హీరోయిన్ లుగా రాణించాలని కళలు కంటూ ఉంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు, అలాగని అసాధ్యం అని చెప్పడానికి వీలు లేదు. కానీ ఇక్కడ విపరీతమైన పోటీ ఉండడం కారణంగా... ప్రతిభ ఉండాలి కానీ అవకాశాలు ఆలస్యంగా అయినా ఒకటో రెండో ఖచ్చితంగా వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు దానిని రెండు చేతులా ఉపయోగించుకుంటే పది సినిమాలు చేసుకుని హాయిగా ఉండొచ్చు. ఈ విధంగా వచ్చిన తొలి అవకాశాన్ని సరిగా ఉపయోగించుకుని స్టార్ హీరోయిన్ లుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అటువంటి బాపతుకు చెందిన హీరోయిన్ మన కృతి శెట్టి. ఈమెది కర్ణాటక అయినా చూడడానికి తెలుగమ్మాయిలాగా చక్కగా ఉంటుంది.
తనకు ఉన్న కొద్ది పాటి నటనా అనుభవంతో తెలుగులో బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. మొదటి సినిమాతోనే మెగా కాంపౌండ్ హీరోతో జత కట్టింది. దానికి తోడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక్కసారిగా టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది. కృతి శెట్టికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. రెండవ సినిమా కూడా బంగార్రాజు రూపంలో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నానితో ముచ్చటగా మూడవసారి శ్యామ్ సింగరాయ్ లో నటించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. దీనితో బేబమ్మ ను అందరూ తలపై పెట్టుకుని ఊరేగారు. అయితే మొదటి నుండి చాలా మందికి జరిగినట్లే... రెండు మూడు విజయాలు దక్కితే కథల విషయంలో తడబడుతుంటారు హీరోయిన్ లు... కృతి శెట్టి కూడా అదే పొరపాటు చేసినట్లుగా తెలుస్తోంది.
తాజాగా కృతిశెట్టి నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఎవరి బ్యాడ్ లక్ అనేది తెలియదు కానీ రెండు సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. రామ్ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్ లింగుస్వామి తో తీసిన ది వారియర్ ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. కానీ రొటీన్ సినిమాలలాగే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయింది. ఇందులో కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మి గా నటించింది. కానీ ముందు సినిమాలలాగా ఏమంత గొప్పగా నటించింది లేదు. కేవలం పాటల కోసమే ఆమెను పెట్టుకున్నట్లు ఉంది.
నితిన్ మరియు కృతి శెట్టి నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా గత వారమే రిలీజ్ అయింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఇది కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. దీనితో వరుసగా రెండు సినిమాలు కృతి శెట్టి కి ప్లాప్ లుగా నిలిచాయి. ఇది కృతి శెట్టికి ఒక గుణపాఠం అని చెప్పాలి. మరి ముందు ముందు అయినా మంచి కథలను ఎంచుకుంటుందా ? లేదా చాలా మంది హీరోయిన్ లలాగా కెరీర్  ను నాశనం చేసుకుంటుందా అన్నది చూడాలి.
ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి సుధీర్ బాబు హీరోగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. దీనికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇది కాకుండా మరో రెండు సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. అయితే ఈ సినిమా హిట్ అయితేనే తనకు మళ్ళీ మునుపటి వైభవం వస్తుంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: