స్టార్ హీరోయిన్ తమన్నాకు పెళ్లి జరగడం ఖాయమట ?

VAMSI
సాధారణంగా సినీ పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ హీరో, హీరోయిన్ ల కాంబినేషన్ లో సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అని, కొందరి కాంబో ఫెయిల్యూర్ అని, ఆ హీరో సినిమాలో చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోతారు అని...ఇలా చాలానే ఉంటాయి. కాగా అందులో చిరుతో రెండోసారి జత కట్టిన సీనియర్ స్టార్ హీరోయిన్లకు ఆ కథానాయికకి పెళ్లి జరిగిపోతుందని ఒక చిన్న సెంటిమెంట్. గతం లో  చిరు చిత్రం లో చేసిన ఖైదీ నం 150 సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేసింది. ఆ తరవాత చిరు తో ఆచార్య సినిమాకు సైన్ చేయగా...అది సెట్స్ పై వుండగానే గౌతం కిచ్లు ను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు.
ఇక సైరా సినిమాలో చిరు కి జంటగా నయనతార నటించగా.. ఆ తరవాత ఇపుడు గాడ్ ఫాదర్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. ఇది చిరుతో ఆమె చేస్తున్న రెండో చిత్రం. అయితే రెండో సినిమా మొదలయ్యిందో లేదో...ఎప్పటి నుండో వాయిదాలు పడుతూ వివాదాల మద్య నలుగుతున్న నయన్ పెళ్లి కాస్త ఇపుడు ఫిక్స్ అయిపోయింది. దర్శకుడు విగ్నేష్ శివన్ తో పెళ్ళి డేట్ లాక్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది నయన తార. అయితే ఇపుడు ఇదే సెంటిమెంట్ తమన్నా విషయం లోను వర్కౌట్ అవుతుందని కొందరు అంటున్నారు. అది నిజమవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
మూడు పదుల వయసు దాటుతున్నా తమన్నా ఇప్పటి వరకు పెళ్లి ఊసే ఎత్తకపోవడం అమే అభిమానులు బాధపడుతున్నారు. అయితే ఈ సెంటిమెంట్ కలిసొచ్చి ఆమె కూడా పెళ్లి చేసుకుని సెటిల్ అయితే చూడాలని తన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా చిరు తో సైరా నరసింహారెడ్డి చిత్రం లో నటించిన తమన్నా ఇపుడు భోళా శంకర్ సినిమాకి కూడా ఓకే చెప్పగా ఈ ప్రచారం మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: