ఇండియాలో డాక్టర్.. కానీ భర్త కోసం ఆఫ్ఘన్ లో ఉగ్రవాదిగా

Mamatha Reddy
గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న అలజడుల గురించి అందరికీ తెలిసిందే. అధికారిక మార్పిడి వల్ల అక్కడ నెలకొన్న ఉద్ధృతి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అధికార మార్పిడి వల్ల ఓ తల్లి కన్న కలలు కల్లలు అయ్యాయి. ఎప్పుడో దూరమైన బిడ్డను ఎప్పటికైనా చూడగలను అన్న ఆశలపై నీళ్లు చల్లింది. కేరళకు చెందిన ఓ మహిళ బిందు సంపత్ ఆమె కుమార్తె నిమిష అలియాస్ ఫాతిమా ఉగ్రవాద సంస్థ ఐసిసిలో చేరి 2019 వ సంవత్సరం నుంచి ఆఫ్ఘన్ జైల్లో ఖైదీగా ఉంది.  

భారత్ ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య మంచి సంబంధాలు ఉండడంతో తన కుమార్తెను విడిపించుకోవాలని ఆ తల్లి ఇన్ని రోజులు ప్రయత్నించారు.  కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తం కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆమె తల్లిదండ్రులు. తన బిడ్డకు ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం వారిలో నెలకొంది. కేరళలో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన బిందు సంపత్ ల తనయ నిమిష. డెంటిస్ట్ గా సేవలు అందించేవారు. అయితే ఓ ముస్లిం కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది.  ఇస్లాం మతం స్వీకరించి ముస్లిం గా తన జీవితాన్ని కొనసాగించింది. అలా నిమిష కాస్త ఫాతిమా గా మారిపోయింది.

ఐసీసీ ఉగ్ర మూకలో చేరాలన్నా భర్త ఒత్తిడితో ఆమె జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా భర్త కోసం 2016లో వెళ్ళింది. ఆమెతో పాటు 20 మంది మహిళలు తమ భర్తతో కలిసి దేశం దాటారు. వారంతా వెళ్లి అక్కడ ఐసిస్ ఉగ్రమూక లో చేరారు.అక్కడే ఫాతిమా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంత లో ఎన్కౌంటర్ లో ఆమె భర్త హతమయ్యారు. ఆమె తో పాటు కేరళకు చెందిన మరో ఇద్దరు మహిళలు కూడా భర్తలను కోల్పోయి దిక్కులేని స్థితిలో పడ్డారు. తాలిబన్ ల నుంచి ప్రమాదం ఉందని భావించి 2019 సంవత్సరంలో ఆఫ్ఘాన ప్రభుత్వానికి లొంగి పోయారు వీరు. అప్పటి నుంచి కాబూల్ జైలులో ఉంటున్నారు. కొన్ని రోజులుగా తన కూతురు మాట్లాడక పోయేసరికి అనుమానం వచ్చి ఆరాతీయగా ఆమె జైల్లో ఉన్నట్లు తెలిసింది. నాటినుంచి ఆమె తల్లిదండ్రులు తన కుమార్తెను భారత్ కు తిరిగి రప్పించేందుకు కేంద్రానికి 1882 సార్లు విజ్ఞప్తి చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: