అమ్మ: వ్యాక్సిన్ తర్వాత బిడ్డకి పాలు ఇవ్వొచ్చా..??

N.ANJI
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి తన రూపాంతరన్ని మార్చుకొని మానవులపై దాడి చేస్తూనే ఉంది. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక ఈ మహమ్మారిని కొంతమేరకు అయినా తట్టుకోవడానికి దేశంలో వ్యాక్సినేషన్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే మహిళలు వ్యాక్సిన్ వేసుకోవడం మంచిదేనా? వ్యాక్సిన్ వేసుకున్న తరువాత పిల్లలకు పాలు ఇవ్వొచ్చా లేదా అనే దాని గురించి ఒక్కసారి చూద్దామా.
సాధారణంగా మహిళలు గర్భం ధరించి ఉన్నప్పుడు కానీ, డెలివరీ సమయంలో కొవిడ్ మహమ్మారి ఉన్నట్లు తెలిసినా కూడా చేతులు శుభ్రంగా కడుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. మాస్క్ వేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా బిడ్డకి పాలివ్వచ్చు అని చెబుతున్నారు. ఇక బిడ్డకి పాలిస్తున్న తల్లులు కూడా వ్యాక్సిన్ వేయించుకుని పాలివ్వడం కంటిన్యూ చేయవచ్చునని చెబుతున్నారు.
అయితే బిడ్డకి పాలివ్వడం అనేది ఎంతో సమయాన్ని తీసుకునే విషయం అని అన్నారు. అంతేకాక .. బాగా అలిసిపోయే విషయం కూడా అన్నారు. ఇక బిడ్డ పుట్టిన మొదటి వారాల్లో బిడ్డకి ప్రతి రెండు మూడు గంటలకి ఒకసారి ఫీడ్ చేయవలసి ఉంటుందని తెలిపారు. అంతేకాదు.. రాత్రి పూట ఇంకా తరచుగా చేయవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక కాబట్టి పిల్లలకు పాలిచ్చే వారు ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్స్ నీ దరి చేరనీయకండి అని చెబుతున్నారు. అలాగే మీ బంధువులు ఏవైనా ప్రతికూలంగా మాటలు మాట్లాడినా పట్టించుకోకండి అని తెలిపారు. అయితే.. ఎందుకంటే ఇవి పాలు సరిగ్గా తయారు కాకుండా చేస్తాయని తెలిపారు. కాగా.. సానుకూల భావాలతో, బిడ్డ పుట్టిన ఆనందాన్ని అనుభవించాలని చెబుతున్నారు. ఇక బిడ్డని హత్తుకుని పరవశులవ్వండి అని అంటున్నారు. అంతేకాక.. మీరూ బిడ్డా కూడా ఆరోగ్యంగా ఉంటారు, మీరు బిడ్డకి సరిగ్గా పాలివ్వగలుగుతారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: