కూలీ కూతురు.. నూటికి నూరు మార్కులు

Mamatha Reddy
ఇటీవల కాలంలో పిల్లలు ఎంతో ముందు తనంతో ఆలోచించి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గమనించి చదువులో రాణించడం మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థునీలు తమ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వారిని తర్వాత కాలంలో సుఖపెట్టాలంటే ఉద్దేశ్యం తో ఇప్పటినుంచి చదువుకోవడం మొదలు పెడుతున్నారు. ఈ విధమైన ప్రోత్సాహం వారికి రావడంతో భవిష్యత్ లో ఇంకా మంచి ప్రయాణాలు చేయాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు సైతం. ఆ విధంగా ఉత్తర ప్రదేశ్ లో 12వ తరగతి సిబిఎస్సి ఎగ్జామ్స్ ఫలితాలు ఇటీవలే ప్రకటించగా ఓ కూలీ కూతురు నూటికి నూరు శాతం మార్కులు సంపాదించి అందరి ప్రశంసలు అందుకుంది.

బలహీన వర్గాల ఆడపిల్లల విద్యకు ప్రేరణగా నిలుస్తూ అన్సూయ బడేర గ్రామంలో మిగతా ఆడ పిల్లలకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఆమె నివసిస్తున్న గ్రామంలో ఎనిమిదో తరగతి వరకే ఉండడం తో మా ఊర్లో అమ్మాయిల చదువు ఎనిమిదో తరగతి పూర్తి అవుతుంది ఆ పైన ఎవరు చదువుకోరు అంటూ ఫలితాలు విడుదల తర్వాత తమ గ్రామ పరిస్థితిని తెలియజేసింది ఈ 17 సంవత్సరాల అన్సూయ. ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన యువత కోసం ఏర్పాటుచేసిన బులంద్ షహర్ లోని ఫౌండేషన్ ద్వారా విద్యజ్ఞాన్ లో చదువుకుంటుంది ఈమె. 

అందరిలో ఒకేలా కాకుండా వేరు గా ఉండాలనేది ఆమెకు మొదటి నుంచి అలవాటు. అందుకే సీబీఎస్ఈ పరీక్షలు వందకు వందశాతం మార్కులు తెచ్చుకోవాలనే ఆశయంతో సాధన మొదలుపెట్టి విజయం సాధించింది. కుటుంబ పరిస్థితులు ఓ వైపు మరోవైపు కరోనా పిల్లలను చదువులో వెనుకంజ వేయిస్తుంటే ఆన్లైన్ ద్వారా తన చదువును కొనసాగించి గమ్యాన్ని చేరుకుంది. ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా, కరెంట్ సమస్యలు ఉన్న
కష్టం అనేది లేకుండా వాట్సప్ స్టడీ మెటీరియల్ చదువుతూ ఎంతో సాధన చేసి ఆమె ఈ ఘనతను సాధించింది. ఆడ పిల్లలకు ఎనిమిదో తరగతి అయిపోగానే పెళ్లి కోసం తరువాత గృహ జీవితం కోసం తీర్చిదిద్దుతారని అబ్బాయిలు తమ పెద్ద వారితో కలిసి శారీరక శ్రమ ఉండే పొలం పనుల్లో చేరుతూ ఉంటారని ఆమె వివరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: