అమ్మ: గర్భిణీ స్త్రీలకు కొన్ని ముఖ్యమైన విషయాలు..!?

N.ANJI
సాధారణంగా గర్భిణీ మహిళలు ప్రెగ్నెసీ విషయంలో చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో నియమాలు పాటించడం చాలా మంచిది. వాటిని పాటించడం వల్ల మీకు ఆరోగ్యం మరింత బాగుంటుంది పైగా ఇవి చాలా అవసరం. ప్రెగ్నెసీ సమయంలో స్త్రీలు ప్రతి రోజూ వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఫిట్ గా ఉండడానికి వీలవుతుందని అన్నారు. ఇక అదే విధంగా మీరు ఎంత యాక్టివ్ గా ఉండాలంటే అంత యాక్టివ్ గా ఉండాలని సూచిస్తున్నారు. గర్భిణులు యాక్టివ్ గా ఉండటం కూడా మంచిదని తెలిపారు. కాగా..క్యాలరీలు లేని ఆహారాన్ని తీసుకోవద్దని తెలిపారు.
అయితే గర్భధారణ సమయం లో కాన్స్టిపేషన్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాదు.. మంచి ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇక ముఖ్యంగా పండ్లు, కాయగూరలు, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, ఆపిల్ తీసుకోవడం వల్ల ఫైబర్ పెరుగుతుంది. ఇక ఇటువంటి తీసుకోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు.
గర్భధారణ సమయంలో గుండెలో మంట అలాంటివి ఏమైనా కలిగినప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం, ఫ్రై చేసిన ఆహారం తీసుకోవద్దు కొద్దిగా కొద్దిగా మాత్రమే మీరు మీల్స్ ని తీసుకోవాలి. ఆలా తీసుకోవడం వలన చాలా మంచిది. అయితే కొందరు గర్భిణీలకు అయితే ఉదయం లేవ గానే నీరసంగా ఉంటారు. ఇక గర్భధారణ సమయంలో ఇటువంటివి సహజంగా అవుతుంటాయి. కాగా.. అలాంటి సమయంలో మీరు ఉదయాన్నే లేవగానే నీరసం లాంటివి తొలిగించుకోవాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలా చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే చాలా మంది ఎక్కువగా స్నాక్స్ లాంటివి తింటుంటారు. అయితే ఒక మీల్ కి మరొక మీల్ కి మధ్యలో ఉండే సమయంలో ఏదైనా స్నాక్స్ చాలా మంది తింటుంటారు. కాగా.. స్నాక్స్ తీసుకునే సమయం లో కూడా ఆరోగ్యకరమైనవి తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: